Telugu News

ఖమ్మంలో ఏఎన్ఎం పోస్టుల కోసం పైరవీలు

పోస్టు ఇప్పిస్తామని రూ. 2.80 లక్షలు  వసూల్ చేసిన ఓ మహిళ

0

ఏఎన్ఎం పోస్టు కోసం పైరవీలు

== పోస్టు ఇప్పిస్తామని రూ. 2.80 లక్షలు  వసూల్ చేసిన ఓ మహిళ

== ఇల్లు తనకాపెట్టి ఇచ్చిన బాధితులు

== ఏడాది గడిచిన జాబ్ లేదు.. పైసలు లేవు

== అడిగితే బెదిరిస్తున్నరంటున్న బాధితుడు

== న్యాయం చేయాలని బాధితుడు మీడియాకు ప్రకటన

నిఘావిభాగం, సెప్టెంబర్ 14(విజయంన్యూస్)

బాధ్యతాయుతమైన వృత్తి లో ఉన్న ఓ వ్యక్తి సతిమణి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షలు దండుకుంటున్న వైనం ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది.. ఔవుట్ సోర్సింగ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి అమాయక నిరుపేద ప్రజలకు వల వేసి భారీగా డబ్బులు వసూళ్లు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు స్వయంగా మీడియాకు ఒక ప్రకటన, అందుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్, వీడియో కాల్స్, చెక్కులు, ప్రాంసరీ నోట్లను మీడియాకు పంపించారు. ఇళ్లు తనకా పెట్టి డబ్బులు కట్టానని, ఇళ్లు పోయేటట్లు ఉందని, అధికారులు స్పందించి డబ్బులు ఇప్పించాలని బాధితుడు వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి:  గ్యాస్ ప్రమాద బాధితులకు పరిహారం: మంత్రి పువ్వాడ 

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్భన్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన నునావత్ వీరబాబు జేసీబీ వర్క్స్ చేస్తూ ఉంటాడు. ఆయన భార్య నాగమణి ఏఎన్ఎం శిక్షణ పొంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో ఓ మిత్రుడి ద్వారా పక్క జిల్లాకు చెందిన ఓ మహిళ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని తెలియగా ఆమె అడ్రస్ తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె మమతా రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త బాధ్యత కల్గిన వృత్తిలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన్నుఆసరగా చేసుకున్న ఓ మహిళ  ఉద్యోగాలు ఇప్పిస్తామనే పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు తెలుసుకుని ఆమె వద్దకు వెళ్లారు. ఔవుట్ సోర్సింగ్ అయిన పర్వాలేదు తన భార్య నాగమణికి ఉద్యోగం ఇప్పించాలని ఆ మహిళను అడిగారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏఎన్ఎం పోస్టులను భర్తి చేస్తుంది… ప్రభుత్వ పోస్టు  ఎక్కువ డబ్బులు అయితాయి, మీకు ఇష్టం అయితే రూ.3లక్షలు ఇవ్వాలని ఆ మహిళ బాధితుడు నూనావత్ వీరబాబు, ఆయన భార్య నాగమణికి చెప్పారు.

దీంతో వారు రూ.2.80లక్షలు ఇస్తామని చెప్పి, మొదటిగా బాధ్యతకల్గిన వృత్తిలో ఉన్న తన భర్త పోన్ నెంబర్ కు పోన్ పే ద్వారా 2021 జూన్ 3 న మధ్యాహ్నం 1గంట 1 నిమిషం కు (ట్రాన్స్ సెక్షన్ ఐడి నెంబర్ టి 210603 1300570563150210)  రూ.1లక్షను ట్రాన్సఫర్ చేశారు. ఆ తరువాత రూ.1.80లక్షలను జాబ్ ఇప్పిస్తామని చెప్పిన  మహిళకు అప్పజెప్పారు. రోజులు, నెలలు గడిచాయి. అయినప్పటికి ఉద్యోగం రాకపోవడంతో బాధితులు ఆ మహిళను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మాకు ఉద్యోగం వద్దు మా పైసలు మాకు ఇవ్వమని చెప్పి వందల సార్లు పోన్లు చేసిన ఎత్తకపోవడం, పట్టించుకోకపోవడం జరిగిందని, ఇంటికి వెళ్తే అక్కడ లేకుండా ఉండటం లాంటి సంఘటనలు జరిగాయాని బాధితుడు తెలిపారు. దీంతో ఆమె మరో నెంబర్ తీసుకుని పోన్ చేసి మాట్లాడితే అదిగో, ఇదిగో అంటూ ఏడాదిన్నర పాటు తిప్పుకున్నారని బాధితుడు తెలిపారు. అయితే మాకు ఉద్యోగం వద్దు మా డబ్బులు మాకు ఇవ్వండి అని పెద్దమనుషులతో పంచాయతీ పెట్టించగా ప్రాంసరీ నోట్, స్టాంఫ్ కాగితం రాసి ఇచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి మాకు అందుబాటులో లేదని తెలిపారు.

== కేసులు పెడితే డబ్బులు రావు అంటూ బెదిరింపులు

బాధితులు ఫోన్ ద్వారా ఆమెను బాధితుడు డబ్బులు అడిగి,ఇవ్వక పోతే కేసు పెడతా అని చెప్పడంతో ఆమె నుంచి బెదిరింపులు ప్రారంభమైయ్యాయని బాధితుడు వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు.  కేసులు పెడితే మీ డబ్బులు రావు అంటూ హెచ్చరికలు చేసిన ఆడియో సంభాషణలను మీడియాకు విడుదల చేశారు. నేను ఇంకొకరిని నమ్మి ఇచ్చా ,ఆయన ఉద్యోగం ఇప్పించేది ఆయన ఇవ్వాలి అప్పటి వరకు నేనేట్లా ఇస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడుతోందని బాధితుడు తెలిపారు. ఇళ్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చానని, నా డబ్బులు నాకు ఇవ్వాలని, లేకపోతే ఇళ్లును బ్యాంకర్లు వేలం వేసే అవకాశం ఉందని కాబట్టి నాకు డబ్బులు ఇవ్వాలని ఆమెను ఎంత బ్రతిమిలాడుకున్న ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, నా డబ్బులు నాకు ఇప్పించి పుణ్యం కట్టుకోవాలని సూచించారు. మరీ అధికారులు ఈ విషయంపై స్పందిస్తారా..? లేదంటే వదిలేస్తారా..? వేచి చూడాల్సిందే..? ఈ విషయంపై సంబంధిత మహిళను వివరణ కోరేందుకు బాధితుడు ఇచ్చిన రెండు పోన్ నెంబర్ల ద్వారా పోన్ చేసి, మేసేజీ ద్వారా ప్రయత్నం చేసిన ఆమె పోన్ రిసీవ్ చేయలేదు..  

allso read- *సీఎల్పీ నేత భట్టిని కలిసిన మంద కృష్ణ