Telugu News

సుందరనగరంగా ఖమ్మం : సీఎం కేసిఆర్ ప్రసంశ

ఖమ్మం నగర అభివృద్ధి పై సీఎం కేసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

0

సుందరనగరంగా ఖమ్మం : సీఎం కేసిఆర్ ప్రశంస

== ఖమ్మం నగర అభివృద్ధి పై సీఎం కేసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

== మంత్రి పువ్వాడ అజయ్ పై ప్రశంసలు కురిపించిన ముఖ్యమంత్రి కేసిఆర్

== ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో వ్యాఖ్యానించిన సీఎం కేసిఆర్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం జిల్లా అభివృద్ధి ఐకాన్ గా నిలిచిందని, సుందరఖమ్మంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ప్రగతి భవన్ లో నిజామాబాద్ అభివృద్ధి, ప్రగతి అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నేతలకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ ఒకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం..

allso read- పాఠశాలల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిందే..? మంత్రి సబితారెడ్డి

ప్రభుత్వ కృషితో నేడు సుందర నగరంగా మారిందని ముఖ్యమంత్రి కేసిఆర్ స్పష్టం చేశారు. నిరంతరం ఖమ్మం నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన దృష్టిని కేంద్రీకరించి పని చేస్తున్నారు అని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రశంసించారు. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలని , ఖమ్మం టూరుకు వెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రావాలని అని నిజామాబాద్ అధికారులను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించారు. దీంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి మంత్రిపదవి ఇవ్వడమే కాకుండా అనేక వనరులను, అర్థిక వసతులను కల్పించే విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఖమ్మంకు, వ్యక్తిగతంగా తనకు ఎంతో సహాయసహాకరాలు అందించారని, అడిగిందాళ్ల ఇవ్వడం వల్లనే ఖమ్మంను ఈ స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ కు ఖమ్మం జిల్లా ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఇక ఖమ్మం జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అభినందనించడం, ప్రశంసించడంతో ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.

allso read- ఖమ్మంలో సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి