Telugu News

ఖమ్మం నగరాభివృద్ది ఎక్కడుంది :ఎండీ.జావిద్

నాలుగు రోడ్లు, నాలుగు పౌంటేన్లు పెడితే అభివృద్ది జరిగినట్లేనా..?

0
ఖమ్మం నగరాభివృద్ది ఎక్కడుంది
== నాలుగు రోడ్లు, నాలుగు పౌంటేన్లు పెడితే అభివృద్ది జరిగినట్లేనా..?
== కాంగ్రెస్ కార్పోరేటర్లకు నిధులు కేటాయించడంలేదేందుకు..?
== కాంగ్రెస్ కార్పోరేషన్లో ఆన్యాయం జరుగుతోంది.. జనం తిరగబడతారు
== రాహుల్ గాంధీ దేశ్ కి నేత.. కేసీఆర్ క్వార్టర్ కి నేత
== కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్న బీజేపీని తరిమికొట్టండి
== భారత్ జోడో యాత్ర సభలో పీసీసీ సభ్యుడు, నగరకమిటీ అధ్యక్షుడు ఎండీ.జావిద్
== రెండవ రోజు కొనసాగిన భారత్ జోడో గ్రామయాత్ర
*== అడుగడుగునా నిరాజనాలు పలికిన జనం*
ఖమ్మం, అక్టోబర్ 11(విజయం న్యూస్):
 ఖమ్మం నగరం అభివృద్దిలో దూసుకపోతుందని గొప్పలు చెబుతున్న బీఆర్ఎస్ నేతలకు నగరంలో ప్రజల సమస్యలు కనిపించడం లేదని, ఎక్కడ అభివృద్ది జరిగిందో ప్రజల్లోకి వస్తే తెలుస్తుందని పీసీసీ మెంబర్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ తెలిపారు.
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర కు సంఘీభావంగా ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో జింకలతండా నుంచి  ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జావిద్ ఆధ్వర్యంలో ప్రారంభించిన భారత్ జోడో గ్రామయాత్ర కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. ఖమ్మం నగరంలోని 2వ డివిజన్ లో ఈ యాత్ర కొనసాగింది.  ఈ గ్రామ యాత్రను ఖమ్మం జిల్లా మహిళలు అడుగడుగున హారతులిస్తూ స్వాగతం పలికారు.  గ్రామ యాత్ర అడుగడుగున నీరాజనాల పలుకుతుండగా,  కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని సుమారు 60ఏళ్ల పాటు పాలించిన గాంధీ కుటుంబంలో జన్మించిన రాహుల్ గాంధీ చాలా సామాన్యుడిగా, దేశ ప్రజల క్షేమం కోసం, దేశ ప్రజలను బీజేపీ నేతల భారీ నుంచి రక్షించేందుకు భారత్ జోడో పాదయాత్ర చేపట్టారని, ఆ యాత్రకు సంఘీభావంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 150 రోజుల పాటు భారత్ జోడో గ్రామయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశ సంపదను ఇష్టానుసారంగా కొల్లగొడుతున్న బీజేపీ నాయకుల అరాచకాలు రోజురోజుకు మితిమిరిపోతున్నాయని, ప్రశ్నించేవారిపై ఐటీ దాడులు అంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. సాక్ష్యాత్తు రాష్ర్టాల ముఖ్యమంత్రులను

కూడా ఐటీ, ఈడీ దాడులంటూ భయాందోళనకు గురిచేస్తూ వారి పరిపాలన చేసుకోకుండా చేస్తూ ఎమ్మెల్యేలను కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూలగొడుతున్నారని ఆరోపించారు. 60ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పడు బీజేపీ చేస్తున్నట్లుగా ఆనాడు చేసి ఉంటే బీజేపీ పార్టీ కూకటవేళ్లతో తొలిగించేదని, అడ్రస్ లేకుండా పోయేదని అన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం, దేశ ప్రగతి కోసం ఏర్పాటైన పార్టీ అని, అలాంటి పిచ్చితప్పులు చేయకపోవడం వల్లనే నేడు బీజేపీ ఉనికి చాటుకుందన్నారు. రాహుల్ గాంధీని బీజేపీ నాయకులు విమ్మర్శలు చేయడం చూస్తే నవ్వోస్తుందన్నారు. రాహుల్ గాంధీ రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం ఉన్న వదులుకున్నాడని, ఏఐసీసీ అధ్యక్షుడి పదవని త్యాగం చేసి గాంధీయేతర కుటుంబానికి ఇస్తున్నాడంటే ఎంత త్యాగం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో ఎంత సామాన్యుడిగా వ్యవహరిస్తున్నారో, ఎంత క్రమశిక్షణ కనిపిస్తుందో ప్రజలందరు చూస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బయట కాలు పెడితే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని మోడీకి, రాహుల్ గాంధీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. ప్రజలందరు ఎవరు ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటున్నారో ఆలోచించి నిర్ణయించుకోవాలని కోరారు.
*== ఖమ్మంలో అభివృద్ది ఎక్కడ*
ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ది ఎక్కడ ఉందో బీఆర్ఎస్ నేతలు చూపిస్తారా..? అని జావిద్ ప్రశ్నించారు. నాలుగు రోడ్లు, నాలుగు పౌంటేన్లు, మమత కాలేజి చుట్టు నాలుగు లైన్ల రోడ్లు, మంత్రి ఇంటికి పోయేందుకు సెంట్రల్ లైటింగ్, మమత కాలేజీ వద్ద లకారం పార్కు దాని చుట్టు అభివృద్ది తప్ప ఖమ్మం నగరాభివద్ది ఎక్కడైనా కనిపిస్తుందా..? అని ప్రశ్నించారు. నేటికి ఎంతో మంది మంచినీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డబ్బులు వచ్చే కాంట్రాక్టు పనులు విషయంలో మంత్రి పువ్వాడ చూపించే ఇంట్రస్టు ప్రజలపై, ప్రజలు తిరిగే వీధులపై చూపించాలని ప్రశ్నించారు. ఖమ్మం నగరం చుట్టు అవినీతి కుప్పలాగా పెరిగిపోతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ అవినీతి భరతం పడతామని అన్నారు. allso read- మూలాయం సింగ్ మృతి పట్ల సీఎల్పీ నేత భట్టి సంతాపం
== ప్రతిపక్ష కార్పోరేటర్లపై చిన్నచూపు
ఖమ్మం కార్పోరేషన్ లో ప్రతిపక్ష కార్పోరేటర్లపై అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పోరేటర్లు, మేయర్ చాలా చిన్నచూపు చూస్తున్నారని, మేము తప్ప మేరేవ్వరు ఇక్కడ పని చేయోద్దన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎండీ.జావిద్ ఆరోపించారు. కాంగ్రెస్ కార్పోరేటర్లకు నిధులు కేటాయించడం లేదని, పనులు కేటాయింపు జరగడం లేదని, అడపాదపడా నిధులు వచ్చిన ఆ నిధులను కార్పోరేటర్లను కాదని వాళ్ల పార్టీ కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఈ విషయంపై అనేసార్లు మేయర్ ను, కమీషనర్ ను కలెక్టర్ ను కలిసి వినతి చేశామని, ఇంకా వాళ్ల పద్దతి మారకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకుంటామని అన్నారు. ఖమ్మం నగర కార్పోరేషన్ నిధుల విషయంలో మంత్రి జోక్యం చేసుకోవడం బాధాకరమన్నారు. ఆయన చెప్పిన వారికి నిధులు మంజూరు చేస్తున్నారని, అది సమానాత్వమా.?అని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ప్రజాప్రతినిధుల పట్ల చిన్నచూపు తగదని పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కార్పోరేటర్ల ఉన్న ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
== అడుగడుగున నిరాజనం 
  ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మల్లీదు వెంకటేశ్వర్లు,లకావత్ సైదులు, పల్లెబోయిన చంద్రం, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కరుణాకర్ రెడ్డి, కొట్టెముక్కల నాగేశ్వరావు, బాలాజీ నాయక్, కిలారు రమణ, ఖమ్మం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు దామ స్వరూప, ఖమ్మం జిల్లా మహిళా సెక్రెటరీ ఏలూరి రజిని, కావ్య,లాల్ బి, రవి,  కరుణాకర్ రెడ్డి, శంకర్ నాయక్, శ్రీశైలం యాదవ్, శంకర్,గౌస్, స్వరూప, రజయ, రెంటాల ప్రసాద్, నర్సింహారావు, కృష్ణ, అంతోటి శివ, తేలపట్ల శ్రీను, కాలువ నర్సింహారావు, శీలం శ్రీను, బోయిన సురేష్, చెల్లా రాంబాబు, బెంగాల్ ఉపేందర్, గుడిపల్లి గోపి, మల్లేశం,  తదితరులు హాజరయ్యారు.