Telugu News

 బిలీఫ్ ఆసుపత్రి పై ఐటీ దాడులేందుకు..?

అసలు కారణమేంటి..?

0

 బిలీఫ్ ఆసుపత్రి పై ఐటీ దాడులేందుకు..?

== ప్రభుత్వానికి కొమ్ము కాసి పైసలు పంపించారనే అనుమానంతోనేనా..?

== ఆంధ్రాలో సంపాధనను ఖమ్మంలో పెడుతున్నారనా..?

== అక్రమాలు జరుగుతున్నాయా..? ఐటీ కట్టడం లేదని దాడులు చేశారా..?

== అసలు కారణమేంటి..?

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో వందలాధి ఆసుపత్రులు ఉన్నాయి.. పదుల సంఖ్యలో ఎమర్జెన్సీ ఆసుపత్రులున్నాయి.. అందులో బిలీఫ్ ఆసుపత్రి ఒక్కటి.. అన్ని ఆసుపత్రుల్లాగే ఈ ఆసుపత్రి నడుస్తోంది. కానీ ఎందుకు ఆ ఒక్క ఆసుపత్రిపై ఐటీ అధికారులు దాడులు చేశారు..? బిలీఫ్ ఆసుపత్రి అక్రమాలకు పాల్పడుతుందా..? ప్రభుత్వ నిషేదిత పనులు చేస్తోందా..? ఐటీ కట్టకుండా ఎగొట్టే పనిలో ఉన్నారా..? ఏదేమైనప్పటికి ఖమ్మం నగరంలో బిలీఫ్ ఆసుపత్రిపై కచ్చితంగా సమాచారం లాభాట్టుకునేంత వరకు ఐటీ అధికారులు బిలీఫ్ ఆసుపత్రిలో చోదాలు నిర్వహించారు. ఒక్క గంట, రెండు గంటలు కాదు, ఏకంగా ఐదు నుంచి ఆరు గంటల పాటు తనిఖీలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎందుకు అంతగా ఆ ఆసుపత్రిపై ఐటీ అధికారులు కన్నేశారు.. అక్కడ ఏం జరుగుతోంది.. పూర్తి వివరాలను విజయం పత్రిక అందిస్తున్న కథనం..

ఇది కూడా చదవండి: ఖమ్మంలో ఐడీ దాడులు

బిలీఫ్ ఆసుపత్రి యజమాన్యం ఆంధ్రప్రాంతానికి చెందినవారిగా పలువురు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రులు ఉన్నాయని, అక్కడ ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. అక్కడ ఆధాయం ఘనంగా ఉండటంతో పాటు ఖమ్మంలో ఏర్పాటు చేసిన బిలీఫ్ ఆసుపత్రి కార్పోరేట్ స్థాయిలో నడిపిస్తున్నారు. పరిశుభ్రత విషయంలో, వైద్యసేవలను అందించడంలో కూడా ఆ ఆసుపత్రి యజమాన్యం అద్భుత రిసీవ్ ఉంటుందని అంటున్నారు. అందుకే అక్కడ కూడా మంచిగా ఆధాయం వస్తుందని, ఐటీ చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.. అది ఎంత వరకు నిజం..? డబ్బులు సంపాధించుకుంటే దాడులు చేస్తారా..? అనే అనుమానాలను కూడా కొంతమంది సందించిన పరిస్థితి ఉంది.. అయితే ఇందులో ఇంకో కోణం దాగి ఉంది. ఆసుపత్రి యజమాన్యం ప్రజల నుంచి ఎక్కువ ఫీజులు వసూల్లు చేస్తున్నారని, పేషెంట్ వస్తే పిండేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేద, సాద అనే తేడా చూడకుండా లక్షల రూపాయల్లో బిల్లులు వసూల్ చేస్తున్నారని, బ్రతిమిలాడినా యాజమాన్యానికి కనీసం కనికరం ఉండదని నిఘా సంస్థలు అక్కడికి చేరుకున్న సందర్భంగా ప్రజలు అనుకోవడం కోసమెరుపు. అయితే ఇంతటికే దాడులు జరుగుతాయా.? అంటే అంతకంటే బలమైన కారణం ఉందని పలువురు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీఫ్

బిలీఫ్ ఆసుపత్రికి రాజకీయ కోణం కూడా ఉందని, ఖమ్మం నగర మేయర్ ఎన్నిక విషయంలో వేరే పార్టీ తరుపున పోటీ చేసి గెలవాలని తపించినట్లు చర్చ జరుగుతోంది..  కానీ ఎందుకో వెనకడుగు వేశారు. ఆ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో ఆమె మనసు మార్చుకున్నట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉంటె లాభం లేదనుకున్నారో..? ఏమో కానీ గత కొంత కాలంగా వారు అధికార పార్టీకి దగ్గరైనట్లు ప్రచారం జరుగుతోంది.  అప్పటినుంచి అధికార పార్టీ కార్యక్రమాల్లో ప్రధానంగా మంత్రి కనుసన్నల్లో పనిచేస్తూ, ఆయన వద్ద మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేసినట్లు సమాచారం.  అందులో కొంత సక్సెస్ అయ్యారని పలువురు చెబుతున్నారు. అక్కడే అసలు రాజకీయ కోణం బయటకు వచ్చింది..

== మునుగోడుకు డబ్బులు తరలించారా..?

రాష్ట్రంలోనే సెమిపైనల్ గా భావించిన ఎన్నిక మునుగోడు నియోజకవర్గంలోని ఉప ఎన్నిక. దేశవ్యాప్తంగా ఎదురుచూసిన మునుగోడు ఉప ఎన్నికకు బిలీఫ్ ఆసుపత్రి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అర్థిక చేయూతనందించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మునుగోడు నియోజకవర్గానికి ఆసుపత్రి నుంచే భారీగా డబ్బులు పంపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రతినిధ్యం వహించిన మండలానికి ఆసుపత్రి నుంచే డబ్బులు రవాణా జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే కేంద్రప్రభుత్వానికి అనుబంధంగా ఉండే ఐటీ, ఈడీ అధికారులు అకస్మీకంగా దాడులు చేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఐటీ అధికారులు బుధవారం చేసిన దాడులు ఖమ్మం జిల్లాతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగానే కలకలం రేపిందనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: జుజ్జులరావుపేటలో రియల్ దందా..?