Telugu News

క్రిష్ణయ్య హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం: బీజేపీ లీగల్ సెల్ 

నిందితులను కస్టడికి తీసుకోకుండానే రిమాండ్క్ ఎలా పంపిస్తారు

0

 

క్రిష్ణయ్య హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం: బీజేపీ లీగల్ సెల్ 

== ఆ కేసు దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయి

==  నిందితులను కస్టడికి తీసుకోకుండానే రిమాండ్క్ ఎలా పంపిస్తారు

== పోలీసులేందుకు వన్ సైడ్ ఉద్యోగం చేస్తున్నారు

== క్రిష్ణయ్య కుటుంబ సభ్యలను పరామర్శించి బీజేపీ స్టేట్ లీగల్ టీం

ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 24(విజయంన్యూస్)

తమ్మినేని కృష్ణయ్య హత్యకేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసు దర్యాప్తు ప్రాపర్గా జరగలేదని, ధర్యాప్తులో పలు అనుమానాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ కమిటీ కన్వీనర్ అంటోని రెడ్డి అన్నారు. శనివారం మండలం తెల్దారుపల్లిలో గత నెల 15న దుండగుల చేతిలో హత్య చేయబడ్డ టీఆర్ఎస్ నాయకుడు,ఆంధ్రాబ్యాక్ డైరెక్టర్ తమ్మినేని క్రిష్ణయ్య కుటుంబ సభ్యులను బీజేపీ స్టేట్ లీగల్ టీం పరామర్శించారు.

allso read-  బెల్లం వేణు… నీ చరిత్ర విప్పవమంటావా..?: మౌలానా

క్రిష్ణయ్యకు చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టులో లొంగిపోయిన నిందితులను పోలీసులు కస్టడీలోకి  తీసుకోలేదని ప్రశ్నించారు. కృష్ణయ్య కుటుంబ సభ్యులు స్వతంత్ర సంస్థకు కేసును అప్పగించాలని కోరుతున్నారని, తప్పకుండా సీబీఐ ఎంక్వైయిరీ కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తామని హామీ ఇచ్చారు. అవసమైతే సెంట్రల్ హోం మినస్త్రీకి కూడా రిప్రజంటేషన్ చేస్తామని అన్నారు.  కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. బీజేపీ లీగల్ టీం తప్పకుండా సీబీఐ ఎంక్వైరీ కోరుతుందన్నారు. నిజాలు నిగ్గుతేలే వరకు తాము కేసుపై దృష్టి పెడతామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి  కేసుపై నివేదిక అందజేస్తామని అన్నారు. వచ్చే నెల 10 వరకు కోర్టుకు హాలీడేస్ ఉన్నందున అనంతరం పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. కృష్ణయ్య మర్డర్లో విషయంలో పెద్ద స్థాయిన రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటం వలన ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యానారాయణ,  శ్రీనివాస్గౌడ్, శ్రీకాంత్ గౌడ్, డీ. శ్రీనివాసరావు, గడ్డం గణేష్, కటకం శారవ, కృష్ణ, అనన్య, వనం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

allso read- త్వరలో ఖమ్మం-సూర్యపేట నేషనల్ హైవే ప్రారంభం..?