Telugu News

ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?

గెలుపు కోసం  బీఆర్ఎస్ కొత్తవ్యూహం

0

బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?

== ఖమ్మం గడ్డపై గులాబీ దండు

== గెలుపు కోసం  బీఆర్ఎస్ కొత్తవ్యూహం

== ఇంచార్జ్ లను నియమించిన అదిష్టానం

== నియోజకవర్గాల్లో దూకుడు పెంచిన ఇంచార్జ్ లు

== ఆ ఇద్దరిపై విమ్మర్శనాస్త్రాలు

== బీఆర్ఎస్ లక్ష్యం నేరవేరేనా..?

ఖమ్మం గుమ్మంలో గులాబీ దండు దూకుడు పెంచింది.. కాంగ్రెస్ కు కంచుకోటగా మారిన ఖమ్మం జిల్లాను కారు జిల్లాగా మార్చేందుకు గులాబీ బాస్ అస్త్రసత్రాలను ప్రయోగిస్తున్నారు..అందులో భాగంగానే బీఆర్ఎస్ దళం సరికొత్త వ్యవూహానికి పదునుపెట్టింది.. అగ్రనేతలిద్దరిపై గురిపెట్టింది..విమ్మర్శేల అస్త్రంగా మలుచుకుని బాణాలను  వదిలే ప్రయత్నం చేస్తోంది.. ఆ ఇద్దర్ని టార్గెట్ చేసింది.. తప్పిదాలను బయటపెడుతూ ప్రజల్లో పలచన చేసే ప్రయత్నంలో మునిగింది.. అందుకే నియోజకవర్గాలకు ధీరులను పంపించింది.. ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆయుదంగా మార్చి యుద్దానికి పంపించింది.. అవసరమైన చోట ఆటాడేందుకు సిద్దమవ్వాలని చెప్పింది.. ఖమ్మం గుమ్మంలో కారు పార్టీని రేపరేపలాడించే ప్రయత్నం చేస్తోం ది..? కానీ ఖమ్మం జిల్లాలో కారుపార్టీ  లక్ష్యం నేరవేరుతుందా..? సీఎం కేసీఆర్ పంపించిన బాణాలు ప్రత్యర్థుల గుండెలను చీల్చేస్తాయా..? లేదంటే పగలిపోయి పార్టీ అధినేత పరువు తీస్తాయా..? విజయం తెలుగు దినపత్రిక అందించే రాజకీయ విశ్లేషణాత్మక కథనం మీకోసం.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో అచ్చిరాని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఖమ్మం జిల్లానే.. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం కాలేదు.. అన్ని జిల్లాలో ఒక రకంగా పార్టీ ఉంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోరకంగా ఉంది.. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉండేది.. 2014, 2018 ఎన్నికల్లో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన రిజల్ట్ వచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేయగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితమైంది. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లా ఐరెన్ లెగ్ అన్నట్లుగా ఉంది.. అయితే రెండు ఎన్నికలకు సింగిల్ సీటుకే పరిమితమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ ఈ సారైన స్పీడ్ పెంచుదామనుకుంది. కానీ

allso read- తుమ్మల  చేరికు అప్పుడే..? 

గేరు మార్చే ఎక్స్ లెటర్ వైర్ తెగినట్లు బలం పెంచుకుందామని అనుకునే సమయానికి కీలక నేతలు జారిపోయారు.. పోయినోళ్లు పోతేమాయే.. ఉన్నోళ్లనైనా రక్షించుకుందామనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహానికి పదునుపెట్టింది.. ఇప్పటికే రెండు సార్లు గెలిచి మూడవ సారి హ్యాట్రిక్ సాధించేందుకు ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకం కానుంది.. కనీసం ఈ జిల్లాలో ఐదు స్థానాలనైనా గెలుచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.. అదే జరగాలంటే బీఆర్ఎస్ లో చాలా మార్పులు తీసుకరావాలని భావించిన సీఎం కేసీఆర్, అందుకు పదను పెట్టారనే చెప్పాలి..  వెళ్లినోళ్లు వెళ్లిపోయారు.. ఉన్నవాళ్లనైనా వాళ్లతో వెళ్లకుండా చూసుకోవాలి.. దాంతో పాటు అందర్ని కలుపుకుని పోవాలని భావించిన సీఎం కేసీఆర్  పార్టీలో అసమత్తిగా ఉన్న నేతలను కాకా పట్టే ప్రయత్నంలో నిమగ్నమైయ్యారు. వారితో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.. బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తే, ప్రభుత్వం వచ్చిన తరువాత కీలక పదవులను ఇస్తామని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.. మొత్తానికి బుజ్జగింపులు మంచివే అయినప్పటికి ఎంత వరకు సక్సెస్ అవుతాయనేది ప్రశ్న.

== వ్యూహం మార్చిన బీఆర్ఎస్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయ్యేందుకు, సీట్లు గెలిపించేందుకు సీఎం కేసీఆర్ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్, జిల్లాలోని పార్టీ ముఖ్యనాయకులు చేజారిపోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఆయన వ్యూహం మార్చినట్లే తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంచార్జ్ ను నియమించి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడటం, సమన్వయం చేయడం, ప్రచారంలో పాల్గొనే విధంగా చేయడం, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేయాల్సిన కార్యక్రమాలను నడిపించే నాయకులు కావాలని సీఎం కేసీఆర్ భావించారు. అందుకు గాను ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంచార్జ్ ను నియమించింది.

allso read- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

ఖమ్మం నియోజకవర్గంతో పాటు, వైరా నియోజకవర్గానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఇంచార్జ్ గా నియమించింది. అలాగే భద్రాచలంకు ఎమ్మెల్యే తాతామధుసూదన్, కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పాలేరుకు కందాళ ఉపేందర్ రెడ్డి,అశ్వరరావుపేట, మధిరకు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు,పినపాకకు ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు, సత్తుపల్లికి రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డిలను ఇంచార్జ్ లుగా నియమించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను వారికి అప్పగించారు. అంతే కాకుండా  ఎన్నికల ప్రచారం, సమన్వయం, పార్టీలో చేరికలు తదితర అంశాలను ఇంచార్జ్ లకు నియమించారు.

==  ఆ ఇద్దరే టార్గెట్…?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందాలంటే కచ్చితంగా రాజకీయ వ్యూహం అవసరం. అందుకే రాజకీయ చాణిక్యుడైన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఖమ్మం జిల్లా రాజకీయాలపై కన్నేసినట్లే కనిపిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి వల్ల ప్రమాదం ఉందని భావించిన సీఎం కేసీఆర్ వారి ఇద్దరిపై గురిపెట్టి రాజకీయంగా దెబ్బతీయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆ ఇద్దరిపై అవకాశం దొరికినప్పుడల్లా విమ్మర్శలు చేయాలని నిర్ణయించారు. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఎంపీలు గాయత్రి రవి, పార్థసారథిరెడ్డి, నామా నాగేశ్వరరావులు ప్రతిపక్ష పార్టీల నాయకులపై విమ్మర్శల హస్త్రాలను సందిస్తున్నారు.

allso read – అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?

తట్టెడు మట్టి పోయనోళ్లు ఖమ్మంలో పోటి సే హక్కు ఉందా..? అని ఆరోపిస్తూ అభివద్దిపై ఎక్కడకు చర్చకు రమ్మన్న వస్తానంటూ కాంగ్రెస్ పార్టీపై సవాల్ చేస్తూ ప్రసంగిస్తున్నారు. అలాగే తాతామధు, గాయత్రి రవి, పార్థసారథి కూడా  ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు కురిపిస్తున్నారు. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ గా చేసుకుని వారిపై వ్యక్తిగత విమ్మర్శలు చేస్తున్నారు. దీంతో తుమ్మల నిశబ్ధం పాటిస్తున్నప్పటికి పొంగులేటి మాత్రం అందుకు తగ్గట్లుగా దీటైనా సమాధానాలిస్తూ ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతలను దూరం చేసుకున్న  బీఆర్ఎస్ పార్టీ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకునే పనిలో నిమగ్నమైంది. రాజకీయ శత్రువులుగా భావించే ఆ ఇద్దరిపై విమ్మర్శనాస్త్రాలను సందిస్తూనే ఎన్నికల ప్రచారంలో దూసుకపోతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలను మారుస్తుందో..? తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా నేరవేరుస్తుందో..? వేచి చూడాల్సిందే…