Telugu News

ఖమ్మం బస్టాండ్ కు రాష్ట్ర స్థాయి లో నెంబర్ వన్

అభినందనలు తెలిపిన ఆర్టీసీ ఆర్ఎం సిహెచ్ వెంకన్న

0
ఖమ్మం బస్టాండ్ రాష్ట్ర స్థాయి లో నెంబర్ వన్
== బస్ స్టేషన్ పరిశుభ్రతలో మొదటి స్థానం సాధించిన ఖమ్మం బస్టాండ్
== ఆర్టీసీ ఎండి చేతుల మీదుగా  ప్రశంసాపత్రం, నగదు పురస్కారం అందుకున్న ఖమ్మం డిపో మేనేజర్
—అభినందనలు తెలిపిన ఆర్టీసీ ఆర్ఎం సిహెచ్ వెంకన్న
—హర్షం వ్యక్తం చేస్తున్న ఖమ్మం డిపో ఉద్యోగులు
        (ఖమ్మం -విజయం న్యూస్)
            ఖమ్మం బస్ స్టేషన్ నిర్వహణలో పరిశుభ్రత మరియు ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనలోనూ బస్ స్టేషన్ సిబ్బంది చేసిన సేవాకృషి ఫలితంగా బస్ స్టేషన్ ను పరిశుభ్రంగా నిలిపినందుకుగాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బస్ స్టేషన్ గా ఖమ్మం బస్ స్టేషన్ ఎంపికైంది. ఆదివారం హైదరాబాదులోని ఆర్టీసీ కళాభవన్ లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి సి సజ్జనార్ గారి చేతుల మీదుగా ఖమ్మం డిపో మేనేజర్ శ్రీ బి శ్రీనివాస్ ని శాలువాతో సత్కరించి పదివేల రూపాయల నగదు బహుమతితో పాటుగా ప్రశంసాపత్రం ఇచ్చి అభినందించారు.
 సోమవారం ఖమ్మం నూతన బస్ స్టేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రీజినల్ మేనేజర్  సిహెచ్ వెంకన్న  ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర రవాణా శాఖా పువ్వాడ అజయ్ కుమార్ మానస పుత్రిక అయిన ఖమ్మం నూతన బస్ స్టేషన్ కు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన మరియు పరిశుభ్రత విషయంలో మొదటి స్థానంలో అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అవార్డు పొందిన ఖమ్మం డిపో మేనేజర్ శ్రీనివాసరావుకి రీజనల్ మేనేజర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి ఉత్తమ బస్ స్టేషన్ అవార్డు పొందడానికి కారకులైన సూపర్వైజర్లను,బస్ స్టేషన్ సిబ్బందికి ఆయన పేరుపేరునా ఆయన అభినందనలు తెలిపారు. ఇదే రకమైన సేవాకృషిని కొనసాగించాలని, ప్రయాణికుల ఆదరాభిమానాలు పొందాలని సంస్థ ప్రతిష్టను ఇనుముడింపబడి చేయడంతో పాటు సంస్థ అభివృద్ది కోసం మరింత శ్రద్ధతో పనిచేయాలని ఆయన సూచించారు.
                 ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న, ఖమ్మం బస్ స్టేషన్ ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న సేవలను తెలియజేస్తూ, ప్రయాణికుల సౌకర్యం కోసం నూతన బస్ స్టేషన్ లో టికెట్ల రిజర్వేషన్ కౌంటర్ ను 14వ నెంబర్ ప్లాట్ ఫామ్ కి ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణానికి సంబంధించిన ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం పొందాలని సూచించారు.
అదేవిధంగా నూతన బస్ స్టేషన్ ప్రాంగణంలో 24/7 గంటలు అందుబాటులో ఉండే విధంగా సరుకులు మరియు పార్సిల్ రవాణాకు సంబంధించిన కార్గో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రయాణికులు తమ వస్తువులను మన రాష్ట్రం తో పాటు బెంగళూరు,చెన్నై,తిరుపతి, విశాఖపట్నం లాంటి సుదూర ప్రాంతాలకు తమ సరుకులను ఆర్టీసీ కార్గో ద్వారా రవాణా చేసుకోవాలని ఆయన సూచించారు.అదేవిధంగా దసరా దీపావళి పండుగలను పురస్కరించుకొని టిఎస్ఆర్టిసి బస్సుల్లో నెల రోజులు ముందస్తుగా వచ్చుటకు మరియు వెళ్ళుటకు ఒకేసారి రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణికులకు వారి తిరుగు ప్రయాణంలో టిక్కెట్టు చార్జీలో 10 శాతం రాయితీ సౌకర్యాన్ని కల్పించామని ఈ సౌకర్యాన్ని కూడా ప్రయాణికులు ఖమ్మం టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ద్వారా పొందాలని ఆయన తెలిపారు.
             ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న, ఖమ్మం రీజినల్ పర్సనల్ ఆఫీసర్ రామ్మోహన్ రావు, డిపో మేనేజర్ బి శ్రీనివాస్ గారు అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ రామిశెట్టి రామయ్య, సూపరింటెండెంట్ ఏ. నాగేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ పర్సనల్ శ్రీమన్నారాయణ స్టేషన్ మేనేజర్ గుండపునేని రామకృష్ణ, పలువురు కంట్రోలర్లు ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.