నేతాజీ విగ్రహానికి పూలమాల వేసిన ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ .
ఖమ్మం స్థానిక బోస్ బొమ్మ సెంటర్ లోని సుభాష్ చంద్రబోస్ గారి125 పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ గారు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
నేతాజీ విగ్రహానికి పూలమాల వేసిన ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ .
(ఖమ్మం – విజయం న్యూస్) :-
ఖమ్మం స్థానిక బోస్ బొమ్మ సెంటర్ లోని సుభాష్ చంద్రబోస్ గారి125 పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ గారు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ
నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అంటూ స్వాతంత్రం కొసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం…
మరణం లేని అమరుడు.. భారత్‌కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నతుడు..
స్వాతంత్ర పోరాటం అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలోనూ బ్రిటర్లపై పోరాడుదామని పిలుపిచ్చిన మహావీరుడు..
సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన యోధుడు సుభాష్ చంద్రబోస్.
గాంధీజీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోస్ బలంగా నమ్మారు.
ఈ అభిప్రాయంతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు.
also read :- మంత్రి పర్యటనలో ఉద్రిక్తత
1879వ సంవత్సరం జనవరి 23వ తేదీ ఒడిశాలోని కటక్‌లో జానకీ నాథ్, ప్రభావతీ బోస్‌లకు నేతాజీ జన్మించారు.
చిన్నతనం నుంచి విద్యలో రాణించిన బోస్..
స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 11 సార్లు జైలుకు వెళ్లిన సుభాష్ చంద్రబోస్.. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భరతమాతను రక్షించేందుకు చలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చారు. నేతాజీ ఆధ్వర్యంలో 1944 ఫిబ్రవరి 4న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం కావడంతో ఆంగ్లేయులను దెబ్బ తీయడానికి ఇదే సువర్ణవకాశమని భావించారు. యుద్ధం ప్రారంభం కాగానే కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్‌లో పర్యటించారు.
జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో ‘అజాద్ హింద్ ఫౌజ్’ను ఏర్పాటు చేశారు. జపాన్ అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వంను సింగపూర్ లో ఏర్పరచారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం వారికి ముచ్చెమటలు పట్టించింది. అహింస మార్గంలో మాత్రమే స్వాతంత్ర లభించదని ఆయుధాలను చేతపడితేనే సాధించగలమనే నినాదాన్ని నేతాజీ లేవనెత్తారు. సాయుధ పోరాటాన్ని బలంగా నమ్మిన బోస్.. జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్, మలేషియాల్లోని భారత జాతీయ సైనికదళానికి జీవం పోశారు. 1944 ఫిబ్రవరి 4న బర్మా రాజధాని రాంకూన్ నుంచి భారత్ సరిహద్దులకు భారత్ సైన్యం ప్రయాణమైంది.
also read :- రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు – జిల్లా కిసాన్ కాంగ్రెస్
తర్వాత రెండేళ్లలో కోహిమా కోట, తిమ్మాపూర్- కొహిమాను సైనిక దళం చేరుకుంది. భారత్ జాతీయ సైనిక దళ దాడుల దాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలయింది.
స్వాతంత్రం కోసం తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరిన నేతాజీ.. బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని అణచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు.
తన 41వ ఏటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అహింసామార్గం ఆంగ్లేయులకు అర్థంకాని భాషని తెలుసుకున్న బోస్ 1941లో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం కళ్లల్లో దుమ్ముకొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు అని ఆయన దేశానికి చేసిన సేవలను మరొకసారి గుర్తు చేశారు.
also read :- ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ర్ట్రాల అభివృద్ది: మోడీ
ఈ కార్యక్రమంలో31డివిజన్ అధ్యక్షులు sk. జేహీర్, వేణు, పుల్లయ్య,k. శ్రీను,k. గోపాల్, రవి బీహెచ్ రబ్బాని తదితరులు పాల్గొన్నారు.