Telugu News

ఖమ్మం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వోత్తుల ర్యాలీ

** ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. నాయకులు, పోలీసుల మధ్య తోపులాట

0

ఖమ్మం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వోత్తుల ర్యాలీ
** ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
** మానవ మృగం వనమా రాఘవ ను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి
** రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆగడాలు ఆపాలి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల, నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ.జావిద్
(ఖమ్మం-విజయంన్యూస్);-
ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారి చేపట్టిన కొవ్వోత్తుల ర్యాలీ ఉదక్తతలకు దారితీసింది. కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో నాయకులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు నాయకులను అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం సంజీవ రెడ్డి భవన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కోవిడ్ నిబంధనలను అనుసరించి కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించారు. ఒక్కొక్కరు 20 అడుగుల దూరం నడుస్తూ పక్కా నిబంధనలు పాటించారు.

also read:-ప్రధాని మోడీ కి పంజాబ్ లో అడ్డుగా నిలిచిన ఆందోళనకారుల లక్ష్యం ఏంటి..?

అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువళ్ళ. దుర్గా ప్రసాద్, నగర అధ్యక్షులు మహమ్మద్ జావీద్ మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ, లక్ష్మీ, సాహిత్య, సాహితీ ఒకే కుటుంబంలో తల్లిదండ్రి ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య చేసుకోని సజీవదాహనమైన సంఘటన చాలా బాధకారమన్నారు. అందుకు కారకుడైన వనమా. రాఘవ ను వెంటనే ఉరి తీయాలి అని డిమాండ్ చేశారు. అలా జరిగితేనే రాబోయే రోజుల్లో నాయకులు ప్రజల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించబోరని తెలిపారు. ప్రభుత్వంలో పాలనలో ఉన్న ఎమ్మెల్యే కుమారుడు అత్యంత ఘోరంగా హింసించడం వల్లనే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే వనమా. వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు తెలంగాణ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని వారు హెచ్చరించారు.

also read:-రౌడీషీటర్లను పక్కన పెట్టుకొనేది మీ నాయకులే

తప్పు జరిగితే ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలకు కరోనా భూతాన్ని చూపిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, అదే అధికార పార్టీ నాయకులు అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళి ఎమ్మెల్యేలు సైతం మాస్కో పెట్టుకోకుండా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఎలాంటి కేసులు పెట్టడం లేదన్నారు. ప్రతి రోజు రైతుబంధు సంబరాలు అంటూ గుంపులుగుంపులుగా మీటింగులు నిర్వహిస్తుంటే పోలీసులకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు 20 అడుగుల దూరం పాటిస్తూ ఆక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తుంటే పోలీసుల బలగాలతో అడ్డుకునే ప్రయత్నం చేయటం వెనుక ఆంతర్యమేమిటి ఆయన ప్రశ్నించారు. అనంతరం పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య కొద్దిపాటి తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, నగర కార్పొరేటర్లు దుద్దుకూరు వెంకటేశ్వర్లు, ఎం వెంకటేశ్వర్లు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, బాణాలు లక్ష్మణ్, గజల్ వెంకన్న, షేక్ వసీం, షేక్ సర్దార్, మహ్మద్ రఫేదా భేగం, వడ్డే నారాయణరావు, జిల్లా ఓ బి సి సెల్ ఉపాదక్షులు గజ్జెల్లి వెంకన్న, ఎస్ కె రజీ ,కాళంగి కనకరాజు ,సంపటం నరసింహరావు,ఏలూరి రవి,దొబ్బల నరేష్ , బీరెడ్డి రమేష్ ,జహీర్ ,గౌస్ తదితరులుపాల్గొన్నారు.