ఖమ్మం నగర కార్పోరేషన్ ఏడాది సంబురాలు
ఖమ్మం నగర మున్సిపల్ కార్పోరేషన్ పాలక మండలి ఏర్పాటై శనివారం నాటికి ఏడాది ముగిసింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో నగరమేయర్ పూనకొల్లు నీరజ ఆధ్వర్యంలో మొదటి ఏడాది సంబురాలను ఘనంగా జరుపుకున్నారు
ఖమ్మం నగర కార్పోరేషన్ ఏడాది సంబురాలు
(ఖమ్మం-విజయంన్యూస్)
ఖమ్మం నగర మున్సిపల్ కార్పోరేషన్ పాలక మండలి ఏర్పాటై శనివారం నాటికి ఏడాది ముగిసింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో నగరమేయర్ పూనకొల్లు నీరజ ఆధ్వర్యంలో మొదటి ఏడాది సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా నీరజ, ఉపమేయర్ పాథిమా జోహారా కేక్ కట్ చేసి పక్కన సభ్యులకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్పోరేటర్లు స్పీట్ అందించి మేయర్ కు, ఉపమేయర్ కు పాలక సభ్యులందరికి శుభాకాంక్షలు తెలిపారు.
also read :-ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం.
also read :-మమ్మి అధ్యక్షురాలు .డమ్మీ రాహుల్ గాంధీ: మంత్రి కేటీఆర్
== ఖమ్మం మున్సిపల్ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేసిన సుడా చైర్మన్ బచ్చు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సుడా చైర్మన్ హాజరై మాట్లాడుతూ పాలకవర్గాని శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కే.టి.రామారావు, రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతోనే ఖమ్మం నగర అభివృద్ధి సాధ్యమైందని అన్నారు.
రానున్న రోజుల్లో మరింత ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా మంత్రి అజయ్ కుమార్ గారి సహకారంతో కార్పొరేటర్లు అందరు డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మనులను పొందాలని కోరారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు గా ఎన్నికై సంవత్సర కాలం పూర్తి చేసుకొని అన్ని డివిజన్లను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో పయనింప చేస్తున్న ఖమ్మం నగర కార్పొరేటర్లు అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్.