Telugu News

ఖమ్మం నగరం.. అభివృద్ధి గుమ్మం: పువ్వాడ 

నగర ప్రజల అవసరాలకనుగుణంగా పనిచేస్తున్నా

0
ఖమ్మం నగరం.. అభివృద్ధి గుమ్మం: పువ్వాడ 
==  నగర ప్రజల అవసరాలకనుగుణంగా పనిచేస్తున్నా
== రూ. 1.47 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు  మంత్రి  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఖమ్మం అక్టోబరు1(విజయంన్యూస్):
 ఖమ్మం  నగరాన్ని అభివృద్ధికి గుమ్మంగా తీర్చిదిద్దామని,  నగర ప్రజల అవసరాలకనుగుణంగా ప్రతి డివిజన్‌లో రహదారులు, డ్రైన్‌లు, పార్కులు, జంక్షన్లు, సెంట్రల్‌ లైటింగ్‌, ఏర్పాటు చేసి అభివృద్ధి పర్చడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లలో రూ.1.47 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు  మంత్రి  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఇది కూడా చదవండి:- చచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ: మంత్రి కేటీఆర్

18వ డివిజన్‌ శ్రీరామ్‌ హిల్స్‌ నందు రూ.20 లక్షలతో విడిఎప్‌ టెక్నాలజితో నిర్మించిన సీసీ రోడ్స్‌ను,  ఓపెన్‌ జిమ్‌, మున్సిపల్‌ సాధారణ నిధులు రూ.32.96లక్షలతో ఎర్పాటు చేసిన పార్క్‌ ను మంత్రి పారంభించారు. 18వ డివిజన్‌ శ్రీరాం నగర్‌ రోడ్‌ నెం.10లో ఎల్‌ఆర్‌ఎస్‌  నిధులు రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్‌ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.  31 వ డివిజన్‌ పంపింగ్‌ వెల్‌ రోడ్‌ నందు సుడా నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.15లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్‌ నిర్మాణ పనులకు మంత్రి  శంకుస్థాపన చేశారు.

ఇది కూడా చదవండి:- అభివృద్ధిలో మాకు మేమే చాటి: మంత్రి పువ్వాడ

 ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్‌ లలో ప్రజల విజ్ఞప్తి మేరకు ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.  కనీసం నడవడానికి కూడా సరైన రోడ్డు మార్గం లేని పరిస్థితుల నుండి నేడు అన్ని ప్రధాన రహదారులు విస్తరించి సెంట్రల్‌ లైటింగ్‌, సెంట్రల్‌ డివైడర్‌లు ఎర్పాటు చేసి, అన్ని  గల్లీలలో అత్యాధునిక టెక్నాలజీతో నాణ్యమైన సీసీ రోడ్లు నిర్మించి ప్రజా రవాణాను మెరుగు పరచడం జరిగిందన్నారు. ప్రతి ఇంటి ముందు సీసీ డ్రైన్‌ లతో పాటు సీసీ రోడ్లు నేడు ఉన్నాయని, వీటితో పాటు ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధమైన త్రాగునీరు అందించడం జరిగిందన్నా రు.

ఇది కూడా చదవండి:- పాలేరులో బీఆర్ఎస్ గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ

కార్యక్రమంలో మేయర్‌ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్‌ మందడపు లక్ష్మీ మనోహర్‌, కమర్తపు మురళీ, మేడారపు వెంకటేశ్వర్లు, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణా రావు, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ రంజిత్‌, ఎసిపి గంటా వెంకట్రావు, జి శ్రీనివాస్‌, కాటా సత్యనారాయణ బాబ్జీ, కమర్తపు సరిత, సుజాత, రైస్‌ మిల్లర్లస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర రావు, తోట ఉమరాణి  వీరబద్రం, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్‌, మేడారపు వెంకటేశ్వర్లు, బండారు శ్రీనివాస్‌, రమాదేవి, దండగల రాంబాబు, వేముల వీరయ్య, వల్లేపు భద్రం, తమ్మిశెట్టి గోవింద్‌, వల్లెపు శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.