Telugu News

మహా నగరాలకు దీటుగా ఖమ్మం అభివృద్ధి చేస్తాం

సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

0

మహా నగరాలకు దీటుగా ఖమ్మం అభివృద్ధి చేస్తాం

** ప్రజలు సంక్షేమమే ఏకైక లక్ష్యం

** సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

మహానగరాలకు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసింది విచ్చేస్తున్నామని అదే నా ఏకైక లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ఖమ్మం నగరపాలక సంస్ధ పరిధిలోని 28వ డివిజన్‌లో రూ. 45 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో డివిజన్ పరిధిలో సైడ్ డ్రైయిన్ల నిర్మాణంతో పాటు సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Allso read:- ఖమ్మం లో అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేసిన మంత్రి.

అనంతరం 32వ డివిజన్ లో సీసీ రోడ్డు, డ్రైయిన్ల నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ మొత్తం అవసరమైన చోట ప్రతి రోడ్డును సీసీ రోడ్లుగా మారుస్తామన్నారు. ఖమ్మం నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని దీనిలో భాగంగా నగరంలోని అన్ని డివిజన్లలో రహదారులు నిర్మించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.

Allso read:- బతుకమ్మల వద్ద డ్యాన్స్ వేసిన మంత్రి పువ్వాడ

మహా నగరాలకు ధీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పర్చడంలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను సీసీ రోడ్స్, డ్రైయిన్ల నిర్మిస్తున్నట్లు మంత్రి అజయ్ తెలిపారు.

లో

దాదాపు రూ.1000 కోట్ల పైచిలుకు నిధులతో ఖమ్మం నగరాభివృద్ధికి బాటలు వేసిన ఘనత సీఎం కేసీఆర్‌ సర్కారుకే దక్కుతుందని, మహా నగరాలకు దీటుగా ఖమ్మాన్ని ఆవిష్కరించాలనే ఏకైక లక్ష్యంతో అడిగిన వెంటనే నిధులను సీఎం కేసిఆర్ మంజూరు చేస్తున్నారని నగరపాలక సంస్థకు ఏటా రూ.100 కోట్లు కేటాయించిందని వాటితో అంతర్గత రహదారులు, నిరంతర మంచినీటి వసతి, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌, వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాలువలు, జనాభా ప్రాతిపదికన కూరగాయల మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు.

Allso read:- రవాణా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ