ఖమ్మం నగర సమగ్రాభివృద్ధి నా బాధ్యత: మంత్రి పువ్వాడ
★ ఆధునిక పద్ధతుల్లో ఖమ్మంలో సీసీ రోడ్ల నిర్మాణం
★ నగర సుస్థిర ప్రగతి సాధనే లక్ష్యం
★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
★ పలు డివిజన్లలో సీసీ రోడ్లు ప్రారంభం
(ఖమ్మం-విజయం న్యూస్)
ఖమ్మం పట్టణ సుస్థిర ప్రగతికి సుదృఢ మౌలిక సదుపాయాలే మూలాధారమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. నగరంలోని 17,18,23,53 డివిజన్లలో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ (సీసీ)రోడ్లను బుధవారం మంత్రి ప్రారంభించారు.
నగరంలో సీసి రోడ్లను వ్యాక్యూమ్ డ్రై స్పెషల్లీ లెయిడ్ కాంక్రీట్, ఆధునిక పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి అజయ్ తెలిపారు. ముంబై, బెంగుళూరు, వంటి మహానగరాల్లో ప్రస్తుతం ఈ పద్ధతులను అవలంబిస్తున్నారని వివరించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కే.టీ.రామారావుల ప్రత్యేక చొరవ, స్థిరమైన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం నగరాన్ని సుస్థిరంగా ప్రగతి పథాన నిలబెట్టడం తన లక్ష్యమని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు.
also read :-ఎన్టీఆర్ ఆత్మను చూసిందంటా..? లక్ష్మిపార్వతి సంచలన ప్రకటన
ప్రధాన రహదారులతో పాటు డివిజన్లు లోని రహదారులను ప్రత్యేక కార్యచరణతో నిర్మాణ అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు వివరించారు. వాటితో పాటు మంచినీటి, డ్రైనేజీ పైపులైన్‌ల ఏర్పాటు, ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి పువ్వాడ తెలిపారు.