Telugu News

ఖమ్మం నగరం రాష్ట్రానికే ఆదర్శం..మంత్రి పువ్వాడ.

నాడు కనీస సౌకర్యాలు లేని ఖమ్మం నేడు కార్పొరేషన్లుకు రోల్ మోడల్.

0
ఖమ్మం నగరం రాష్ట్రానికే ఆదర్శం..మంత్రి పువ్వాడ.
== 75 ఏళ్లలో జరగని అభివృధ్ధి ఎడేళ్ళలో జరిగింది.
== నాడు కనీస సౌకర్యాలు లేని ఖమ్మం నేడు కార్పొరేషన్లుకు రోల్ మోడల్.
== కేసీఅర్, కేటీఆర్ సహకారంతోనే ఇంతటి అభివృద్ధి సాధ్యం అయింది.
== ఖమ్మం లో రూ.2.28 కోట్లతో సెంట్రల్ డివైడర్, లైటింగ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 
(ఖమ్మం ప్రతినిధి- విజయం న్యూస్)
ఖమ్మం నగరంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి యావత్‌ రాష్ర్టానికే ఆదర్శమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని 58వ డివిజన్ రాపర్తి నగర్ సెంటర్ నుండి టీఎన్జీవోస్ కాలని వరకు రూ. 2.28 కోట్లతో నిర్మించిన సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఖమ్మం అభివృద్ధికి కోట్లాది రూపాయలు విడుదల చేసిందన్నారు.  75 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేళ్లలోనే సాధ్యమైందన్నారు. ఖమ్మం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాడు ఖమ్మం నగరం అత్యంత దారుణమైన దుస్థితిలో సరైన రోడ్లు లేక, త్రాగునీరు రాక ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు, ఇరుకైన దారులు, రోడ్ల మీద చెత్త చెదారంతో దుర్గంధభరితంగా ఉండేదన్నారు. సొంత ఇంటిని శుభ్రం చేసుకున్న మాదిరిగా ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ నేడు ఖమ్మం రాష్ట్రానికే ఆదర్శంగా నిలువటం గర్వంగా ఉందన్నారు.
తాను ఖమ్మం అభివృద్ధిలో భాగస్వాములు అయి తన వంటి కర్తవ్యంగా ఖమ్మంను టైర్ సిటీస్ వరుసలో నిలుపలని దృఢంగా సంకల్పించుకున్నానని అది నేడు ఆచరణలో చేసి చూపించగలిగామని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి కేసీఅర్ నేతృత్వంలో, పురపాలక మంత్రి కేటిఆర్ గారి సహకారంతో నేడు ఖమ్మం రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లుకు ఆదర్శంగా నిలువడం మనకు గర్వకారమన్నారు. ఖమ్మం నగరంలో ఒకప్పుడు వాటర్‌ ట్యాంకులు గల గల అంటూ తిరుగుతానే ఉండేవి.. ఇప్పుడు ఉన్నాయా.. ఎక్కడైనా కనిపించాయా చెప్పాలన్నారు.  ”నగరంలో వేసవిలో అసలు కరెంట్‌ ఉండేదే కాదు. కానీ ఇప్పుడు రెప్పపాటున కరెంట్‌ పోతుందా. అపార్ట్మెంట్‌లలో ఎప్పుడు జనరేటర్లు నడుస్తానే ఉండేవి. ప్రతి ఇంట్లో ఇన్వెర్టర్లు నడుస్తానే ఉండేవి. గత ప్రభుత్వాలు పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా గమనించాలన్నారు. ఖమ్మం నగరం చిన్న చిన్న రోడ్లతో ట్రాఫిక్‌ సమస్యలతో ఉండేది.. ఇపుడు ఎక్కడ అయిన ఏ రోడ్లు చూసినా విశాలంగా ఉన్నాయి. రోడ్లు విస్తరించాం,  ఖమ్మంలో సరైన స్మశాన వాటిక ఒక్కటి కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు బల్లెపల్లి, కాల్వఒడ్డు వైకుంఠధామంల ముందు సెల్ఫీలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.
ఖమ్మం ప్రజలకు, చిన్న పిల్లలకు ఆహ్లాదం కోసం ప్రతి డివిజన్లలో పార్కులు, అందులో ఓపెన్‌ జిమ్‌లు, పబ్లిక్‌ టాయిలెట్స్‌, తాగునీరు ఇలా అనేకం వసతులు అందుబాటులోకి తీసుకొచ్చామని, తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం ప్రజా అవసరాల కోసం, అభివృద్ధి కోసం 1800 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందన్నారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో పార్కులు, ఓపెన్ జిమ్ లు, పబ్లిక్ టాయిలెట్స్, వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ లు, అన్ని ప్రాంతాలలో రైతు బజార్ లు, వాక్ వే లు, సెంట్రల్ లైటింగ్ లు, వైకుంఠదామాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఫుట్ పాత్ లు, మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరుకొసం ఓవర్ హెడ్ టాంక్ లు, అన్ని జంక్షన్ లలో కూడళ్లు, ఇలా అనేక అభివృద్ధి పనులు చేసుకుని ప్రజలకు మెరుగైన వసతులు, సౌకర్యాలు అందిస్తున్నామని అన్నారు.  నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైనా చిన్న సమస్యలు తలెత్తినా తక్షణమే స్పందించి పరిష్కరించుకుంటున్నమని వివరించారు.  కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ దొరేపల్లి శ్వేత, సుడా చైర్మన్ విజయ్, పబ్లిక్ హెల్త్ఈఈ రంజిత్, బీసీ రంగారావు, నాయకులు ఊట్కురి రవికాంత్, మహేష్, శ్రీనివాస రావు, నాగమణి, మాధవి, సోమయ్య, విశ్వనాథ చారి, పైడిపల్లి సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.