Telugu News

చరిత్ర తిరగరాస్తున్న ‘ఖమ్మం కలెక్టరేట్’

ఖమ్మం కలెక్టరేట్ మహర్థశనే

0

చరిత్ర తిరగరాస్తున్న ‘ఖమ్మం కలెక్టరేట్’

== ఖమ్మం కలెక్టరేట్ మహర్థశనే

== దేశం గర్వించదగ్గ నేత వర్థంతి నేడు..?

== నలుగురు సీఎంలు, మాజీ సీఎం చేతుల మీదగా నేడు ప్రారంభం

== ముస్తాబైన నూతన కలెక్టరేట్‌ భవనం ..

== మంత్రి పువ్వాడ అజయ్ అభివృద్ధి అమ్ములపొదిలో సరికొత్త శిఖరం జిల్లా కలెక్టరేట్

== రాత్రి వేళ వెలుగులు విరజిమ్ముతున్న భవనం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం కలెక్టరేట్ కు మహర్థశ పట్టింది. ఆ భవనం చరిత్ర సృష్టించబోతుంది. ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో, ఎవరు ఊహించని విధంగా ప్రారంభం జరుగుతుంది అనడంలో సందేహమే లేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, దేశంలోని ఏ ప్రభుత్వ భవనంకు దక్కని అరుదైన గౌరవం ఖమ్మం కలెక్టరేట్ కు దక్కబోతుంది..యాధృశ్ఛకమా, కలిసివచ్చిందేమో తెలియదు కానీ.. ఖమ్మం కలెక్టరేట్ కు అద్భుత అవకాశం పొందిందనే చెప్పాలి.. ఎందుకోసమంటే..?

ఇది కూడా చదవండి: నేడు ఖమ్మంలో ‘చంద్ర’ గర్జన

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణం చేసిన సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మాణం పూర్తై ప్రారంభానికి సర్వం సిద్దమైంది.. అన్ని అంగులతో, హైటెక్ రేంజిలో కార్పోరేట్ స్థాయిలో నిర్మాణం చేసిన ఈ కలెక్టరేట్ భవనంకు మహర్థశ పట్టిందనే చెప్పాలి. దేశంలోనే అత్యంత కీలక ముఖ్యమంత్రులైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ చేతల మీదగా ఈ కలెక్టరేట్ భవనంను ప్రారంభించనున్నారు. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ జరగని విధంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ను నలుగురు సీఎం, ఒక మాజీ సీఎంలు ప్రారంభించబోతున్నరంటే నిజంగా ఖమ్మం కలెక్టరేట్ ఎంత అదృష్టం పొందాలి. అంతేనా..?

== సీఎం కేసీఆర్ కు నచ్చిన నాయకుడి వర్థంతి సందర్భంగా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ప్రియాతిప్రియమైన నాయకుడు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు అత్యంత ప్రియమైన అభిమాన నాయకుడు స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు. ఆయన జనవరి 18న చనిపోవడం జరిగింది. అందుకే మంగళవారం ఆయన వర్థంతి జరుగుతుంది..ఇసీఎం కేసీఆర్ కు ఇష్టమైన నాయకుడు, మంత్రి పువ్వాడకు ప్యాన్ అయిన నందమూరి తారకరామారావు వర్థంతి రోజున నలుగురు ముఖ్యమంత్రుల చేతిమీదగా, 5లక్షల మంది జన సమూహం నడుమ ప్రారంభమవుతుందంటే ఆ కలెక్టరేట్ ఎంత మోక్షం కల్గి ఉండాలి. యాధృశ్ఛకంగా జరిగిందా..? కావాలనే సీఎం కేసీఆర్ ఈ తేదిని ప్రకటించారా..? తెలియదు కానీ.. మంగళవారం రోజున మాత్రం ఖమ్మం కలెక్టరేట్ ఒక చరిత్ర సష్టించబోతుందనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: పొద్దుపొద్దుగలే గ్రౌండ్లో మంత్రులు

== చరిత్ర లిఖించబోతున్న ఖమ్మం నగరం

ఒక వైపు ఖమ్మం కలెక్టరేట్ కు ఒక చరిత్ర లిఖించబోతుంటే మరో వైపు ఖమ్మం నగరం కూడా మరో రికార్డును తన ఖాతాలో వేసుకోబోతుంది. ఖమ్మం నగరంలో 5లక్షల మందితో ఏనాడుఇంత పెద్ద బహిరంగ సభ జరగలేదు. అంతే కాకుండా దేశానికే బెస్ట్ సీఎంలుగా ఉన్న కేరళ సీఎం పినరయ్ విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఒకే వేదికపైకి రావడం, ప్రతిపక్షంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఒక సంచలనమే. అంతే కాకుండా రాష్ట్ర స్థాయి పార్టీని జాతీయ స్థాయి పార్టీగా మార్చుకున్న తరువాత మొట్టమొదటి బహిరంగ సభ ఇదే కావడం గమనర్హం.

== విద్యుత్ ఆలంకరణలో కలెక్టరేట్ భవనం

బుధవారం నూతన కలెక్టర్ భవన సముదాయాన్ని సీఎంలు ప్రారంభించనున్న నేపధ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనల మేరకు కలెక్టరేట్‌ను విద్యుత్‌ దీపాలంకరణతో అందంగా ముస్తాబు చేశారు.మంత్రి పువ్వాడ అజయ్ కృషి ఫలితంగా ఇవాళ నూతన కలెక్టరేట్ భవన సముదాయం సరికొత్త అందాలతో కళకళలాడుతోంది. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో తళుక్కున మెరిసిపోతోంది.

ఇది కూడా చదవండి: ఇల్లెందులో ట్రెండింగ్ నేత ‘సంజీవ్’

నూతన కలెక్టరేట్‌కు పరిమళభరితమైన పూల చెట్లును ఏర్పాటు చేయడంతో ప్రాంగణం సువాసనలతో నిండిపోయింది. మంత్రి పువ్వాడ అజయ్ చూపిన చొరవ వలన సువిశాల విస్తీర్ణంలో కొలువుదీరిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణ అంతా ఎటుచూసినా పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపింపజేస్తోంది. కార్యాలయ ప్రాంగణంతో పాటు చుట్టూ పరిసరాల్లో అడుగడుగునా అందమైన పూల మొక్కలు, చెట్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు