Telugu News

 జోడో భారత్ తో మోడీకి భయంపట్టుకుంది : కాంగ్రెస్

ఖమ్మం గాంధీచౌక్ లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

0

 జోడో భారత్ తో మోడీకి భయం: కాంగ్రెస్ 

== అందుకే రాహుల్, సోనియాగాంధీ పై దర్యాప్తు సంస్థలతో వేధింపులు

==  కేంద్రం తీరు దుర్మార్గం

== నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్

== ఖమ్మం గాంధీచౌక్ లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

ఖమ్మం ప్రతినిధి, జులై 27(విజయంన్యూస్)

బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం కరువైందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు.  రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో గత కొన్ని రోజుల నుండి విచారణ పేరిట వేధించడం పట్ల తీవ్రంగా ఖండిస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీ, రాష్ర్ట కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరం, గాంధీచౌక్ లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు సత్యగ్రహ దీక్ష  చేపట్టారు. ఈ  సందర్భంగా ఆయన స్థానికంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో గత కొన్ని రోజుల నుండి విచారణ పేరిట వేధించడం అప్రజాస్వామికం అని అన్నారు.

allso read- విద్యార్థిగా మారిన జిల్లా బాస్

దేశానికి స్వాతంత్య్రం తీసుకురవడానికి వారి కుటుంబం ప్రాణాలను సైతం లెక్కచేయలేదని అలాంటి కుటుంబం పై నేడు మోడీ ప్రభుత్వం దాడులకు పూనుకున్నదని ఇది దేశ జాతికే అవమానకరమని అసహనం వ్యక్తం చేశారు.విపరీతంగా ధరలు పెంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.గాడ్సే వారసులకు గాంధీ వారసులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రారంభించనున్న జోడో భారత్ పాదయాత్రతో బీజేపీకి వెన్నులో వణుకు పుట్టుకొస్తుందని అందుకే వారి కుటుంబం పై దాడికి పాల్పడుతున్నారని విమర్శించారు.

== జోడో భారత్ పాదయాత్రకు భయపడిన మోడీ

అక్టోబర్లోలో రాహుల్ గాంధీ మొదలుపెట్టనున్న “జోడో భారత్” పాదయాత్రను అడ్డుకునేందుకు మోడి ఈడి కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వివర్శించారు. ఈ దద్దమ్మ బెదిరింపులకు కాంగ్రెస్ అధినాయకత్వం భయపడదని హెచ్చరించారు. విచారణకు తమ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం బాగో లేకపోయినా ఎంతసేపు విచారించిన నేను సహకరిస్తానని చెబుతున్నప్పటికి రోజుకు రెండు గంటలు విచారించి మరల తిరిగి రేపురా అపి తిప్పించుకోవడం దుర్మార్గమని అన్నారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారని త్వరలోనే బిజేపిపిని గద్దె దించడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని అన్నారు వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ చౌదరి, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరావు, రాష్ట్ర ఓబీసీ సెల్ నాయకులు వడ్డెబోయిన నర్సింహారావు, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు రాందాస్ నాయక్, రాష్ట్ర మైనార్టీ నాయకులు బీహెచ్ రబ్బాని,జిల్లా బిసి సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, జిల్లా యస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య,

allso read- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పుల చేరిగిన తాటి

మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, కళ్ళెం వెంకటరెడ్డి, గింజెల నర్సిరెడ్డి, శీలం వెంకటరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అధ్యక్షులు కన్నెబోయిన గోపి. ఖమ్మం నగర కాంగ్రెస్ కార్పోరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, పల్లెబోయిన భారతిచంద్రం, కొప్పెర సరీత ఉపేంధర్, ఖమ్మం నగర కాంగ్రెస్ నాయకులు బణాల లక్ష్మణ్, బోజేడ్ల సత్యనారాయణ, తాలురి హనుమంతరావు, యర్‌ కె. రజి, బెడద సత్యనారాయణ, ఏలూరి రవి, నగేష్, సయ్యద్ హుస్సేన్, వివిద మండలాల నుంచి వచ్చిన నాయకులు కొప్పుల గోవిందరావు, పసుపులేటి దేవెందరం, పురుషోత్తం, మొహన్, అంజనికుమార్, పందిరి అంజయ్య బచలకూర నాగరాజు, బోయినవేణు, గుడిబోయిన వెంకటేశ్వర్లు, అరెంపుల రవి, చింతపల్లి రామయ్య యండి గౌస్, అబూల్ అహద్, అభాస్, చలపతిరావు, గజ్జి సూర్యానారాయణ, యడవల్లి నాగరాజు, సుదర్శన్, కందిమళ్ళ వీరబాబు, రాంబాబు, మల్లెల అజయ్, వినోద్. ఎంపీటీసీ సల్లమొతుల లక్ష్మయ్య ఏపూరి మల్లికార్జున్, తదితర నాయకులు పాల్గొన్నారు.