Telugu News

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ధర్నా

కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించిన కాంగ్రెస్ నాయకులు

0

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ధర్నా

== కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించిన కాంగ్రెస్ నాయకులు

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 23(విజయంన్యూస్)

మోడీ – కేడీ పాలనలో పెరిగిన  పెట్రోల్  నిత్యావసర  ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం పట్టణంలో ధర్నా నిర్వహించారు.  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా  ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఆదేశాల మేరకు నేడు ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

allso read- జీవితం పై విరక్తి చెందిన యువకుడు ఏం చేశాడంటే.?

ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనం నుంచి ప్రధర్శనగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన అనంతరం కలెక్టర్ వి.పి.గౌతమ్ కు వినతిపత్రాన్ని అందించారు.   ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ ప్రసాద్, నగర కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు కలిసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ – కేడీ లు ఇద్దరు కలసి రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు మరియు వంట గ్యాస్ విపరీతంగా పెంచుకుంటూ ప్రజలను నట్టేట ముంచుతున్నరాని అన్నారు. పెట్రోల్ & డిజిల్ ధరలను రోజు రోజుకు పెంచుకుంటు సామాన్యులు ప్రయాణం చేయలేని పరిస్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకురావడం చాలా సిగ్గుచేటని అన్నారు.మన దేశం మారో శ్రీలంక కాకముందే మనందరం సమయస్ఫూర్తితో మేల్కొని  మోడీ – కేడీలా ప్రభుత్వాలను గద్దె దించలాని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయల నాగేశ్వర రావు,  జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, రెండో డివిజన్ కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు, దిద్దుకూరు వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్, ఖమ్మం జిల్లా కిసాన్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, ఎస్సీసెల్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొందయ్య, నాయకులు వడ్డే నారాయణ రావు,వీరారెడ్డి, బచ్చలకూర నాగరాజు, బోయిన వేణు, జెర్రిపోతుల అంజని, నాగరాజు, రవి, లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

allso read- మేడారంలో సెల్ టవర్ ఎక్కిన టీఆర్ఎస్ నాయకుడు