Telugu News

ఖమ్మంలో విగ్రహాల తొలగింపు చర్యలు మానుకోవాలి

నగర కాంగ్రెస్ ఆధ్యర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి

0

విగ్రహాల తొలగింపు చర్యలు మానుకోవాలి

== నగర కాంగ్రెస్ ఆధ్యర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి

ఖమ్మం ప్రతినిధి, అక్టోబర్ 16(విజయంన్యూస్)

నగరంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాల తొలగింపు చర్యలను మానుకోవాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఆదర్ష్ సురభి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ మార్కెట్ రోడ్, ఎన్ఎస్పి అతిథి గృహం సమీపంలో గల మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల విగ్రహాలను తొలగించడం దేశాన్ని అవమానించడమే అని అన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీ, స్వాతంత్ర అనంతర దేశ అభివృద్ధికి బాటలు వేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలను  తొలగించడం నీచమైన చర్య అని అన్నారు.వారు జాతీయ నాయకులని,దేశం కోసం వారి ప్రాణాలనే త్యాగం చేశారని గుర్తు చేశారు.

allso read- మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల

అలాంటి త్యాగ మూర్తుల విగ్రహాలను పునరుద్దించాల్సింది పోయి తొలగించడం దారుణం అని అన్నారు.రిపబ్లిక్ మరియు స్వాతంత్రదినోత్సవాల రోజున జాతీయ జెండాలను నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేసిన అనేక జాతీయ భారీ ఏమినాన్స్ లను కార్పొరేషన్ తొలగించిందని అన్నారు.టీ ఆర్ ఎస్ పార్టీల బ్యానర్లు, ఏమినాన్స్ పై లేని అడ్డంకులు కాంగ్రెస్ పార్టీ వాటికే వచ్చిందా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీ బ్యానర్లు ఫ్లెక్సీలు నెలలు తరబడి నగరంలో ఉంచుతారని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లను అదే రోజు తొలగించి తీసుకెళ్లి టిఆర్ఎస్ పార్టీకి వినియోగిస్తున్నారని, మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సామగ్రిని టిఆర్ఎస్ కార్యకలాపాలకు ఎలా ఉపయోగించుకుంటారని ప్రశ్నించారు. తక్షణమే విగ్రహాలను యధావిధిగా కొనసాగించాలని ఇకముందు ఇట్లాంటి చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు,  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ దుద్దుకూరు వెంకటేశ్వర్లు మిక్కిలినేని మంజుల ఎం వెంకటేశ్వర్లు పల్లెబోయిన చంద్రం మహమ్మద్ రఫీదా నిరంజన్ కొప్పెర ఉపేందర్ లకావత్ సైదులు నాయక్ మిక్కిలినేని నరేందర్ చౌదరి మొహమ్మద్ ముస్తఫా తదితరులు హాజరైయ్యారు.

allso read- కూసుమంచి లో రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి