Telugu News

ఉమ్మడి ఖమ్మం జిల్లా పీసీసీ మెంబర్లు వీరే..?

నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఎంపిక

0

ఉమ్మడి ఖమ్మం జిల్లా పీసీసీ మెంబర్లు వీరే..?

== నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఎంపిక

== ఈనెల 17న హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఓటేయ్యనున్న పీసీసీ మెంబర్లు

== కాంగ్రెస్ కార్యకర్తల అనుమానాలకు పుల్ స్టాఫ్ పెట్టిన ఏఐసీసీ..?

ఖమ్మం ప్రతినిధి, అక్టోబర్ 12(విజయంన్యూస్)

పీసీసీ మెంబర్ల ఎంపిక పూర్తైయ్యింది.. నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలతో పీసీసీ నియమించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక సమయం అసన్నమవుతున్న తరుణంలో పీసీసీ మెంబర్ల ఎంపిక కావాల్సి ఉండగా ఆ మెంబర్ల ఎంపిక విషయంలో కొంత తర్జనభర్జన జరిగింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా పీసీసీ మెంబర్ల నియామకం జరిగింది. నాయకులు తమకు ఇష్టమొచ్చినట్లుగా మెంబర్లను నియమించుకున్నారు.

allso read- అస‌రా పింఛ‌న్లు ప‌త్రాలిచ్చారు.. పైస‌లేప్పుడిస్త‌రు

దీంతో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున మాత్రమే పీసీసీ మెంబర్లు ఉండాల్సి ఉండగా ఇటీవలే పదుల సంఖ్యలో పీసీసీ మెంబర్ల పేర్లు బయటకు వచ్చాయి. కొంత మందిని గాంధీభవన్ నుంచి ప్రకటించగా, కొంతమంది తమకు తాము వారికి ఇష్టమైన నేత చెప్పగానే ప్రకటించుకున్న పరిస్థితి ఉన్నట్లు సమాచారం. గాంధీ భవన్ నుంచి జరిగిన తప్పిదమా..? లేదంటే వారి అనుకూలంగా ఉండే నాయకులు చేసిన పోరపాట..? ఏమో తెలియదు కానీ.. పీసీసీ మెంబర్ల నియామకం విషయంలో నాయకుల ఇష్టానుసారమైందనే ఆరోపణలు వినిపించాయి. నియోజకవర్గానికి ఐదారుగురు చొప్పున ప్రకటించుకున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. సామాన్య నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా పీసీసీ మెంబర్ గా ప్రకటించుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా రావడం, ఈ విషయంపై తప్పుడుప్రచారం జరగడం, ఆరోపణలు రావడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏఐసీసీ కార్యదర్శి కే.సీ వేణుగోపాల్ నూతన లిస్ట్ ను ఆమోదించినట్లు తెలుస్తోంది.

== ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20మంది పీసీసీ మెంబర్ల నియామకం..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున పీసీసీ మెంబర్లను నియమిస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. పాలేరు నియోజకవర్గం నుంచి రాయల నాగేశ్వరరావు, రేణుక చౌదరి, ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎండీ.జావిద్, పుచ్చకాయల వీరభద్రం, వైరా నియోజకవర్గం నుంచి మాలోతు రాందాసు నాయక్, వడ్డె నారాయణరావు, మధిర నియోజకవర్గం నుంచి భట్టి విక్రమార్క, శీలం ప్రతాఫ్ రెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సంబాని చంద్రశేఖర్, బైరెడ్డి మనోహర్ రెడ్డి పేర్లను ఖారారు చేసినట్లు తెలుస్తోంది.

allso read- ఏజెన్సీలో బినామీల దందా..?

అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి భద్రాచలం నల్లపు దుర్గాప్రసాద్, బుడిగం శ్రీనివాస్, కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోట్ల నాగేశ్వరరావు, జేబి.శౌరి, అశ్వరరావుపేట నుంచి యడవల్లి క్రిష్ణ, సున్నం నాగమణి, పినపాక నియోజకవర్గం నుంచి చందాసంతోష్, తాళ్లూరి చక్రవర్తి పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఖమ్మం, భద్రాద్రకొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే పోడేం వీరయ్య, పువ్వాళ్ల దుర్గప్రసాద్ లు మొదటిగా ఎంపిక చేసినప్పటికి కాంగ్రెస్ పార్టీలో రెండు పదవులను తొలగిస్తు నిర్ణయం తీసుకోవడంతో వారికి అవకాశం కల్పించలేదు.

== ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో వీరికే ఓటు హక్కు

ఏఐసీసీ అధ్యక్ష స్థానం కోసం ఎన్నికలు జరుగుతుండగా, ఈనెల 17న దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఏఐసీసీ అధ్యక్ష రేసులో గాంధీయేతర కుటుంబంకు అవకాశం ఇవ్వడంతో శశిథరూర్, మల్లిఖార్జున్ ఖర్గే పోటీ చేస్తుండగా, వారు ఇప్పటికే హైదరాబాద్ వచ్చి ప్రచారం చేసి వెళ్లిపోయారు. అయితే ఈనెల 17న జరిగే పోలింగ్ కు ప్రస్తుతం ఎంపికైన పీసీసీ మెంబర్లకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంది. వారికి మాత్రమే గుర్తింపు కార్డులను పీసీసీ అందించనుంది.

allso read- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక దందాలో రారాజు…

అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేకపోయినప్పటికి, ఇటీవలే ఖర్గే ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పడు పైన పేర్కోన్న పేర్లు కల్గిన నాయకులు మాత్రమే హాజరైయ్యారు.