Telugu News

ఈనెల 24న ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ: సంభాని

హాజరుకానున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ డెలిగెట్స్

0

*ఈనెల 24న ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ: సంభాని

*== హాజరుకానున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ డెలిగెట్స్*
*== అందరు హాజరై జయప్రదం చేయండి*
*== మాజీ మంత్రి, ఏఐసీసీ సభ్యులు సంభాని చంద్రశేఖర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్*

(ఖమ్మం-విజయం న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజీతో విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయని, ఆ పేపర్ లీకేజీకి సంబంధించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, ఏఐసీసీ సభ్యులు సంభాని చంద్రశేఖర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోని సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి 9ఏళ్ళు కావస్తున్నా దేశ, రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పులు రాలేదని, దేశ ప్రజలందరు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గెలిచిన తరువాత లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులందరికి ఉద్యోగం వస్తుందని, ఉద్యోగం రాని వారికి రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారని అన్నారు. ప్రచార ఆరాటమే తప్ప ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదన్నారు. అంతే కాకుండా ఉద్యోగ పరీక్షలంటూ ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆ తరువాత డ్రామాలు ఆడుతూ మోసం చేసిందన్నారు. మభ్యపెట్టే కార్యక్రమమే తప్ప మరొకటి లేదని, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఈ నెల 24న నిరుద్యోగుల సమస్యల కోసం నిరుద్యోగ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ దీక్షకు ప్రజలందరు తప్పకుండా నిరుద్యోగులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
== ప్రశ్న పత్రాలు లీక్ కాదు.. అమ్మకాలు జరిగాయి:పోట్ల
ప్రశ్నపత్రాలు లీక్ కాదు..అమ్మకాలు జరిగాయి.. కొనుగోలు జరిగాయి.. బందువులు, మిత్రులకు పేపర్లను, ఉద్యోగాలను అమ్మేస్తున్నారని పోట్ల నాగేశ్వరరావు ఆరోపించారు. ఎంతో ఖర్చు చేసి, కష్టపడి చదువుకుంటున్న విద్యార్థుల శ్రమను, నిరుద్యోగుల కష్టాన్ని లీకేజీల పేరుతో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలందరు, నిరుద్యోగులు, విద్యార్థులు తిరగబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ జావిద్, వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ చౌదరి, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, పుచ్చకాయల వీరభద్రం, రాందాస్ నాయక్, ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, జిల్లా ఎస్ సి సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, నగర ఓబీసీ సెల్ అధ్యక్షులుబాణాల లక్ష్మణ్,నగర యస్ టి సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్, నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్,జిల్లా నాయకులు ఏలూరు రవి, మిక్కిలినేని నరేందర్, మద్ది వీరారెడ్డి, పల్లెబోయిన చంద్రం,పెండ్ర అంజయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.