ఖమ్మం కాంగ్రెస్ వలసల జోరు.. బీఆర్ఎస్ కు హడల్
రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సుల్తాన్, గ్రంథాలయ చైర్మన్ అస్రీఫ్
ఖమ్మం కాంగ్రెస్ వలసల జోరు.. బీఆర్ఎస్ కు హడల్
== రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సుల్తాన్, గ్రంథాలయ చైర్మన్ అస్రీఫ్
== వైఎస్ఆర్ టీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఖమ్మం అభ్యర్థి కృష్ణమోహన్
(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)
ఖమ్మం కాంగ్రెస్ లోకి వలసలు జోరు కొనసాగుతోంది.. ఇప్పటికే అధికార పార్టీ కి చెందిన బడా నేతలతో పాటు కార్పోరేటర్లు కాంగ్రెస్ పార్టీ లో చేరగా ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ కు ఆ పార్టీ కీలక నేతలు పెద్ద షాక్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి:- మాట ఇస్తున్నా…. తప్పేది లేదు: పొంగులేటి
మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్, ఖమ్మం జిల్లా గ్రంథాలయం చైర్మన్ అస్రీఫ్ అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.అలాగే వైఎస్ షర్మిళ పార్టీకి చెందిన వైఎస్ఆర్ టీపీ పార్టీ ఖమ్మం అభ్యర్థి తుంపాల కృష్ణ మోహన్ ఆ పార్టీకీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లోని రేవంత్ నివాసంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా , రేవంత్ రెడ్డి కండువ కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే.. కాంగ్రెస్ అధికారమేనని, కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారందరికి మంచి స్థానమే ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి:-:మాట ఇస్తున్నా…. తప్పేది లేదు: పొంగులేటి
== నేడు కాంగ్రెస్ లోకి వివేక్ వెంకట్ స్వామి.
*సాయంత్రం రాహుల్ గాంధీ ని కలవనున్న వివేక్ వెంకట్ స్వామి…*
*రాత్రి ఖర్గే కాంగ్రెస్ సమక్షంలో కాంగ్రెస్ లోకి…*
*వివేక్ చేరిన తరువాత రేపు ఉదయం జాబితా విడుదల చేయనున్న ఏఐసీసీ..