కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యం: జావిద్
== భట్టి పాదయాత్ర లో ఖమ్మం కాంగ్రెస్ నాయకులు
== భట్టి విక్రమార్క పాదయాత్రకు సంఘీభావం
== పాదయాత్రతో కాంగ్రెస్ కేడర్ లొ కొత్త జోష్
== ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్
పెంబర్తి (కాకతీయ కళాతోరణం), ఏప్రిల్ 30(విజయంన్యూస్) :
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన హాత్ సే హాత్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ తో పాటు 50 మంది ముఖ్యనాయకులు, కార్పొరేటర్లు నిన్న ప్రత్యేకంగా పాల్గొన్నారు.
allso read- 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న భట్టి పాదయాత్ర
తెలంగాణ ఇవ్వడం మొదలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులు, పరిశ్రమలు, పలు సంక్షేమ పథకాలను సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క ప్రజలకు వివరిస్తున్నట్లు జావేద్ చెప్పారు. అంతేకాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ తొమ్మిదన్నర ఏళ్ల నుంచి ప్రజలు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నట్లు జావేద్ స్పష్టం చేశారు. సీఎల్పీ నేత ఇప్పటికే 15 నియోజకవర్గాలు, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. సీఎల్పీ నాయకుడు పాదయాత్ర చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజ్ పొందుతోంది. కార్యకర్తల్లో కొత్త జోష్ రావడంతో పాటు.. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతోంది. భట్టి విక్రమార్కను చూస్తుంటే.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞప్తికి వస్తున్నారని అటు ప్రజలు, ఇటు నాయకులు చెబుతుంటే.. 2023లో అధికారంలోకి రావడం తథ్యంగా అనిపిస్తోంది. భట్టి విక్రమార్కలో వైఎస్సార్ కనిపిస్తున్నారని.. ఆయనలా సంక్షేమ పాలన అందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు జావేద్ చెప్పారు. ఈ పాదయాత్రలో ఖమ్మం కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, పల్లెబోయిన భారతీ చంద్రం, రఘునాథపాళెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలాజీ నాయక్, కోటపాడు సర్పంచ్ బాతుల రమణా సుధాకర్, కొంటెముక్కల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ:జావిద్