Telugu News

 గాంధీభవన్ కు  క్యూ కట్టిన ఖమ్మం కాంగ్రెస్ నేతల

స్క్రీనింగ్ కమిటీని కలిసిన జిల్లా నేతలు

0

 గాంధీభవన్ కు  క్యూ కట్టిన ఖమ్మం కాంగ్రెస్ నేతల 

== స్క్రీనింగ్ కమిటీని కలిసిన జిల్లా నేతలు

==  తనకు టికెట్ ఇవ్వాలని కోరిన జావిద్, రాయల, మానవతరాయ్, రాందాసు

 == అన్ని వర్గాల సహకారం ఉందని వివరణ

 == మైనార్టీలు, ఇతర సామాజిక వర్గాల నుంచి పూర్తి మద్దతు ఉందని ప్రకటన

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

హైదరాబాద్ లోని గాంధీభవన్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యూ కట్టారు.. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు మహ్మద్ సిద్దిక్ లు గాంధీభవన్ కు రాగా, వారిని కలిసేందుకు జిల్లా నుంచి అశావాహులు గాంధీభవన్ కు తరలివెళ్లారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్  మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా రాజకీయా పరిస్థితులను వివరించారు. అనంతరం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు దరఖాస్తులు చేసుకున్న అశావాహుల లిస్ట్ ను స్ర్కీనింగ్ కమిటీకి అందజేశారు. అలాగే ఖమ్మం నియోజకవర్గానికి అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసిన ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహ్మాద్ జావిద్

స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ ను, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మహమ్మద్ సిద్దికిలను కలిసి ఖమ్మం అసెంబ్లీ టికెట్ తనకే కేటాయించాలని  ప్రత్యేకంగా కోరారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నదేవరంటే..?

పాలేరు టిక్కెట్ ను ఆశిస్తున్న రాయల నాగేశ్వరరావు, వైరా టిక్కెట్ ను ఆశిస్తున్న మాలోతు రాందాసు నాయక్, బానోతు బాలాజీ నాయక్, సత్తుపల్లి టిక్కెట్ ఆశిస్తున్న మానవతరాయ్, ఇల్లందు టిక్కెట్ ను ఆశిస్తున్న డాక్టర్ రవి నాయక్, కొత్తగూడెం టిక్కెట్ ఆశీస్తున్న పోట్ల నాగేశ్వరరావు తదితరులు గాంధీభవన్ లో ఉన్న స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ను కలిసి తమకు టిక్కెట్ కేటాయించాలని కోరారు. వారు పార్టీ కోసం చేసిన పనులను వివరించారు.  టికెట్ తనకు ఇస్తే గెలిచే అవకాశాలను, స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలను వారికి వివరించినట్లు తెలిసింది. ఖమ్మం నియోజకవర్గంలో  మైనారిటీలు, కమ్మ సామాజిక వర్గం, బీసీలు, ఎస్సీ,  ఎస్టీలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని జావిద్ వివరించారు. ఖమ్మం నియోజకవర్గంలో దాదాపు 50 వేల ఓట్లున్న మైనారిటీలు, 40 వేల ఓట్లున్న కమ్మ సామాజిక వర్గం, బీసీలు ఎస్సీ, ఎస్సీ, ఎస్టీలు.. తనకు టికెట్ ఇస్తే.. పార్టీకి అనుకూలంగా మరే అవకాశాల్ని వారికి జావేద్ వివరించారు. మైనారిటీ కావడంతో.. ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేస్తారని చెప్పారు. అలాగే బీసీ,  ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రభావం వల్ల, స్థానికంగా వారి కోసం గత పదేళ్లుగా అధికార పార్టీతో చేస్తున్న పోరాటాల వల్ల.. వారాంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అన్ని డివిజన్లో ప్రత్యేకంగా అన్ని విభాగాల కాంగ్రెస్ కమిటీలని నియమించడం ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం జరిగిందని చెప్పారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో అభయ ‘హస్తం’ ఎవరికో..

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విలువలు తెలిసిన వాడిగా పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. 1990లో ఎన్.ఎస్.యూ.ఐ ద్వారా కాంగ్రెస్ లోకి వచ్చినప్పటి నుంచి పార్టీ కోసం ఆహర్నిశలు పని చేశానని చెప్పారు. యూత్ కాంగ్రెస్, సేవాదల్, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్,  సంఘం, కాంగ్రెస్ పార్టీ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్, నెహ్రు యువ కేంద్రం, ప్రస్తుతం ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు,, పీసీసీ మెంబర్ గా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ పీసీసీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంతేకాక 2003లో కరెంట్ ఉద్యమంలో ప్రత్యేకంగా పాల్గొన చరిత్ర ఉంది. ప్రస్తుతం మంత్రి పువ్వడ అజయ్ కుమార్ చేస్తున్న అవినీతి అరాచకాలపై తిరుగులేని పోరాటాన్ని చేస్తున్నట్లు చెప్పారు.  మంత్రికి వ్యతిరేకంగా మానవ హారాలు, క్షేత్ర స్థాయి ఉద్యమాలు, దిష్టి  కొమ్మల దహనాలు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి పలు కేసులు కూడా నమోదు అయినట్లు వారికి వివరించారు. అలాగే . పాలేరు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ కు అండగా ఉన్నారని, ఇప్పటికే అనేక దఫాలుగా కాంగ్రెస్ విజయం సాధించిందని, అవకాశం ఇస్తే గెలిచి వస్తానని రాయల నాగేశ్వరరావు చైర్మన్ కు హామినిచ్చారు. వైరా నియోజకవర్గం పరిస్థితులపై మాలోతు రాందాసు నాయక్.. బాలాజీ నాయక్ వివరించారు.