Telugu News

ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా విజయ్ దివాస్.

** ఇందిరగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించిన నేతలు

0

ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా విజయ్ దివాస్
** ఇందిరగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించిన నేతలు
(ఖమ్మం ప్రతినిధి –విజయంన్యూస్)

అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటి ఆదేశానుసారం, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి పిలుపు మేరకు గురువారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ’విజయ్ దివస్‘ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్గీయ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 1971లో బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా మారడానికి పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పోరాడిందని, దీని ఫలితంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అనే సార్వభౌమ దేశాన్ని స్థాపించిడం జరిగిందన్నారు. ఈ యుద్ధం తూర్పు పాకిస్తాన్, భారతదేశాన్ని పశ్చిమ పాకిస్తాన్‌తో తలపడిందని, తొమ్మిది నెలల పాటు కొనసాగిందన్నారు. 20వ శతాబ్దపు అత్యంత హింసాత్మకమైన యుద్ధాలలో ఒకటి అని, పెద్ద ఎత్తున దురాగతాలకు, 10 మిలియన్ల శరణార్థుల వలసలకు పాకిస్తానీ సాయుధ దళాలచే 3 మిలియన్ల మందిని చంపడానికి సాక్ష్యమిచ్చిందన్నారు.

ఈ సందర్భంగా మొహమ్మద్ జావిద్ గారు మాట్లాడుతూ 1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత సాయుధ బలగాలు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటారు. ఈ రోజున, భారతదేశం దేశాన్ని రక్షించిన సైనికులందరికీ నివాళులర్పిస్తుంది.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్, మాజీ శాసనమండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల M L C గా పోటీ చేసిన రాయల నాగేశ్వరరావు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ,ఖమ్మం నగర కార్పోరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మూడుముంతల గంగరాజు యాదవ్, మద్దినేని రమేష్, సయ్యద్ హుస్సేన్ , ఖమ్మం నగర కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకటయ్య, తూములూరి లక్ష్మీనరసింహారావు, లింగయ్య, మహముద్, రఫీ, రజీ, బాణాల లక్ష్మణ్, గౌస్, రాంబాబు, అంబడిపుడి శ్రీనివాస్, దీపక్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు

also read :- మేమింతే….. మారమంతే….?