Telugu News

ఖమ్మం కార్పోరేషన్ అదుర్స్

ఖమ్మం అభివృద్ధిని సందర్చించిన నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, అధికారులు

0
ఖమ్మం కార్పోరేషన్ అదుర్స్
== ఖమ్మం అభివృద్ధిని సందర్చించిన నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, అధికారులు
== మంత్రి పువ్వాడ విజన్ కు హాట్స్ఆఫ్ చేస్తున్న ప్రజాప్రతినిధులు.
== తక్కువ సమయంలో ఇంత అభివృధ్ధి ఎలా సాధ్యం అయిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న బృందం.
== అభివృద్ధిని చూడాలని ముఖ్యమంత్రి కేసీఅర్ గారే చెప్పడం మామూలు విషయం కాదంటున్న ప్రజాప్రతినిధులు
== మంత్రి పువ్వాడ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న వైనం.*
(ఖమ్మం ప్రతినిధి – విజయం న్యూస్)
మునుపెన్నడూ లేనంత అభివృధ్ధి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  కృషి మేరకు సాధించింది ఖమ్మం.  ఖమ్మం నియోజకవర్గ స్వరూపం పూర్తిగా మారిపోయింది.  ఖమ్మం మున్సిపాలిటీ ఇతర మున్సిపాలిటీ లకు ఆదర్శంగా నిలిచింది. ఖమ్మం లో జరిగిన అభివృద్ధిని స్వయంగా పరిశీలించేందుకు నిజమాబాద్ మేయర్ దండు నీతు కిరణ్, ఎమ్మేల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ & మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రా , మున్సిపల్ డీఈలు, ప్రణాళిక, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులు ఖమ్మం వచ్చి స్వయంగా లకారం ను సందర్శించి అద్భుతమని కితాబులిచ్చారు.
పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మేల్యేగా ఎన్నికైన నుంచి అనతి కాలంలోనే మంత్రిగా తెరాస ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వములో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో గడచిన మూడేళ్లలో ఖమ్మం అభివృద్దికి చిరునామాగా నిలిచింది. అభివృధ్ధి, సంక్షేమంపైనే ప్రత్యేక దృష్టి సారించి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మంత్రి పువ్వాడకు ఖమ్మం ప్రజలు నీరాజనాలు పలుకుతారు. అభివృద్ది అంకెల్లో చివరి సంఖ్యగా ఉన్న ఖమ్మంను మొదటి వరుసలో నిలిపి ఇతర కార్పోరేషన్ లు చూసి నేర్చుకునే స్థాయికి ఎదిగి, ఇతర కార్పోరేషన్ లకు స్ఫూర్తిదాయకం నిలవటం ఖమ్మం చరిత్రలో ఇదో కలికితురాయి. ఖమ్మం ఎంతలా అభివృద్ది చెందిందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఅర్ గారే స్వయంగా నిజమాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అభివృధ్ధి ప్రణాళిక స్థాయి సమావేశంలో ప్రస్తావించడం ఖమ్మం ప్రగతికి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఒకప్పుడు ఆగం ఆగం గా ఉన్న ఖమ్మం నేడు చూడండి ఎంత అద్భుతంగా చేశారో… అన్న ముఖ్యమంత్రి కేసీఅర్ గారి వ్యాఖ్యాలకు యావత్ సభ నివ్వెరపోయారంటే ఖమ్మం ఏ స్ధాయిలో ప్రగతి సాధించింది అవగతం అవుతుంది. అందుకు శక్తివంచన లేకుండా కృషి చేసిన మంత్రి పువ్వాడ ఆలోచనా విధానానికి సలాం కొట్టాల్సిందే. మన అభివృద్ధిని ఇతర జిల్లాలకు ఆదర్శంగా చూపడం ఖమ్మం నగర ప్రజలకు గర్వకారణం. మన అభివృద్ధిని స్వయంగా చూసేందుకు నిజామాబాద్ నుండి జిల్లా కలెక్టర్, వివిధ చైర్మన్ లు, ఎమ్మేల్యేలు, మున్సిపల్, ప్రణాళిక, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులు ఖమ్మం వచ్చి స్వయంగా లకారం ను సందర్శించారు.  మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి ఖమ్మం నగరంలో ఇప్పటి వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ది పనులను స్వయంగా పరిశీలించనున్నారు. అభివృద్దిలో ఎక్కడో అట్టడుగున ఉన్న ఖమ్మంకు ఇంతటి కీర్తిప్రతిష్టలు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి నగర ప్రజలు సర్వదా హర్షధ్వానాలు కురిపిస్తున్నారు.