Telugu News

అభివృద్ది చేతకానీ వాళ్లకు మాట్లాడే హక్కు ఉందా..?: మంత్రి

ఖమ్మం ను ఆదర్శమైన నియోజకవర్గం గా తీర్చిదిద్దుతా

0
అభివృద్ది చేతకానీ వాళ్లకు మాట్లాడే హక్కు ఉందా..?: మంత్రి
== ఖమ్మం ను ఆదర్శమైన నియోజకవర్గం గా తీర్చిదిద్దుతా
== అభివృద్ది రూపంలో మీకు కనుక గా ఇస్తా
== రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మం -విజయం న్యూస్)
ఖమ్మం నగరం 20వ డివిజన్ రామ చంద్రయ్య నగర్ నందు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు.. ఇప్పటికే ఖమ్మం నగరం వ్యాప్తి చెందింది అని  అక్కడ ప్రజలకు కూడా అన్ని వసతులు కల్పిస్తున్నామని అన్నారు.  కార్పొరేషన్ లోని డివిజన్ లలో ప్రజల విజ్ఞప్తి మేరకు సీసీ రోడ్లు అడిగి మరీ వేసినం.. అన్ని డివిజన్ లలో ఎస్డీఎఫ్ నిధుల ద్వారా డ్రెయిన్ల నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.
సహజంగా ప్రజలు ముఖ్యంగా కోరుకునేది రోడ్లు, డ్రెయిన్లు, పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ దీపాలు ఇలా కనీస సౌకర్యాలు మాత్రమే అడుగుతారు అని అన్నారు. అవన్నీ నేనే అడిగి మరి చేయించిన.. అవసరం ఉన్న ప్రతి చోట్ల రోడ్లు వేశామని అన్నారు. ఇంకా మరిన్ని నిధులు తీసుకొస్తాం. చేయాల్సిన అభివృద్ది ఉంది..

ఇది కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధే తన లక్ష్యం: మంత్రి పువ్వాడ

ఇది నిత్య ప్రక్రియ.. కొనసాగుతుందన్నారు. నాపై ఉన్న నమ్మకంతో రెండు పర్యాయాలు గెలిపించారు.. అదే నమ్మకంతో మూడవ సరి గెలిపించాలని కోరుకుంటున్న.. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుని  ఖమ్మం ను ఆదర్శమైన నియోజకవర్గం గా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నా ..అభివృద్ది చేతకానీ వాళ్లు, ఏమి చేయడం రాని వల్లే మాటలు చెప్తారు.. నేను కేవలం చేతలు మాత్రమే చేస్తా.. అది ప్రజలందరికీ తెలుసు. నేను చేస్తున్న అభివృద్దికి అడ్డు పడాలని, కాళ్ళలో కట్టెలు పెట్టాలని ఇక్కడ చాలా మంది విశ్వ ప్రయత్నం చేసి విఫలయత్నం చేశారు. నాపై నమ్మకం, ప్రేమ చూపినందుకు సర్వదా కృతజ్ఞుడను, మీరు చూపించిన అభిమానాన్ని అభివృద్ది రూపంలో మీకు కనుక గా ఇస్తానని చెప్పారు. కార్పొరేటర్ ప్రశాంతి లక్ష్మీ జస్వంత్ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ అళ్ళ నిరిషా రెడ్డి, స్థానికులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: నేడు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్  విడుదల