Telugu News

ఖమ్మం అభివృద్ధే తన లక్ష్యం: మంత్రి పువ్వాడ

ఖమ్మంలోని పలు డివిజన్లలో రూ.5.83 కోట్లతో పలు అభివద్ది పనులకు శంకుస్థాపన చేసిన  రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ 

0

ఖమ్మం అభివృద్ధే తన లక్ష్యం: మంత్రి పువ్వాడ

== ఖమ్మంలోని పలు డివిజన్లలో రూ.5.83 కోట్లతో పలు అభివద్ది పనులకు శంకుస్థాపన చేసిన  రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ 

ఖమ్మం, అక్టోబర్ 8(విజయం న్యూస్): 
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ లలో రూ. 5.83 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు రాష్ట్ర  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి, 20వ డివిజన్ రామచంద్రయ్య నగర్ లో రూ. 50 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్స్, 32వ డివిజన్ జహీర్‌పుర లో రూ.90 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో, రూ. 10 లక్షల సిడిపి నిధులు రూ.10 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు, 50వ డివిజన్ మామిళ్లగూడెంలో రూ.28.50 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, 57వ డివిజన్ రమణగుట్ట ఎస్సి కాలనీ & హనుమాన్ నగర్ నందు రూ.20 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించనున్న
సీసీ రోడ్లు, ఎస్డీఎఫ్ నిధులు రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు, 7వ డివిజన్ టేకులపల్లి, లక్ష్మీ నగర్ నందు నిధులు ఎస్డీఎఫ్, ఎల్ఆర్ఎస్  నిధులు రూ.1 కోటితో నిర్మించనున్న సీసీ రోడ్స్, సీసీ సైడ్ డ్రైన్స్, నిర్మాణ పనులకు, 8వ డివిజన్ గోపాలపురంలో ఎల్ఆర్ఎస్, సుడా నిధులు రూ.1.85 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్స్, సీసీ సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఖమ్మం నగరంలో ప్రస్తుతం చేస్తున్న అభివృద్దికి తీసుకొచ్చినన్ని నిధులు ఏ నియోజకవర్గంలో రాలేదు అని అన్నారు. ఇంకా చాలా అభివృద్ది పనులు జరుగుతాయని, అన్ని పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.  ఇక్కడ ఒక్కో గజం రూ.10 వేలు ఉందని, రానున్న రోజుల్లో రూ.20 వేలు అవుతుందని, అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారుతుందన్నారు.      ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి,  డిఈ లు నవ్య జ్యోతి, రంగారావు, కార్పొరేటర్లు సరస్వతి రవి నాయక్, రాపర్తి శరత్, పగడాల నాగరాజు, అబ్బాస్, పరశురాం, దోరేపల్లి రవి,  దేవభక్తుని కిషోర్ బాబు, సురేష్ నాయక్, గొల్లపూడి హరికృష్ణ, ఆత్కురి హనుమాన్,  అధికారులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.