Telugu News

ఖమ్మం అభివృద్దే  లక్ష్యం: మంత్రి

10వ డివిజన్ లో ఆత్మీయ సమ్మెళనం

0

ఖమ్మం అభివృద్దే  లక్ష్యం: మంత్రి

== 10వ డివిజన్ లో ఆత్మీయ సమ్మెళనం

== పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన 

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరం 10వ డివిజన్ చైతన్య నగర్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు..

ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు, అభివృద్ది పట్ల ఎంతో అవగాహన కలిగిన వారు.

ఖమ్మం నగరంలో చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద గా ఆలోచన చేసి సమస్యలను సమూలంగా తొలగించి పరిస్కరించాం..

కేవలం నగరం అభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఒక్కో డివిజన్ కు 10 నుండి 13 కోట్ల రూపాయలు అభివృద్ధి అందించాం..

ఇది కూడా చదవండి:  ఖమ్మాని వదిలి పెట్టేది లేదు: మంత్రి పువ్వాడ

ఒకప్పుడు ఖమ్మం నియోజకవర్గం కు ఇచ్చే నిధులు నేడు ఒక్క డివిజన్ కు ఇచ్చినం.. ఇంకా ఇస్తాం.. గత ప్రభుత్వాలలో ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన దాఖాలాలు లేవన్నారు.

ఖమ్మం నగరంలో లకారంలో తెప్పోత్సవం చేసిన ఘనత మనది.. శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గోదావరిలో అంగరంగ వైభవంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామీ వారి తెప్పోత్సవం మాదిరిగా ఖమ్మం లకారంలో చేసుకున్నాం. ఇది మనకు ఎంతో ఆశీర్వాదకరం.

ఖమ్మం బైపాస్ రోడ్ నందు రూ.5 కోట్లతో అయ్యప్ప భక్తుల కోసం వైభవోపేతంగా అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతుంది.. రానున్న రోజుల్లో ఖమ్మం అన్ని రంగాలకు వేదికగా నిలువనుంది.

ఇది కూడా చదవండి: పాలేరులో బీఆర్ఎస్ గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ