Telugu News

ఖమ్మం లో అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేసిన మంత్రి.

రూ.1.71 కోట్లతో అభివృధ్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

0

*అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేసిన మంత్రి పువ్వాడ.*

*▪️రూ.1.71 కోట్లతో అభివృధ్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు.*

*▪️ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం.

ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 29(విజయం న్యూస్)

ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.1.71 కోట్లతో నిర్మించనున్న సీసీసైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్ధాపన చేశారు.

ఇది కూడా చదవండి:- బతుకమ్మల వద్ద డ్యాన్స్ వేసిన మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరంలోని 21వ డివిజన్ పార్శిబందంలో రూ.45 లక్షలు, 41వ డివిజన్ సీక్వెల్ రోడ్ లో రూ.45లక్షలు, 58వ డివిజన్ రాపర్తి నగర్-2 లో రూ.45 లక్షలు, 50వ డివిజన్ ఆర్టీసి కాలనీ నందు రూ. 45లక్షలు, మమిళ్లగూడెంలో రూ.11.93లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపన చేశారు.

 

▪️41వ డివిజన్ నందు రూ.24.25 లక్షలతో లకారం ట్యాంక్ బండ్ నిర్మించిన రెండవ గేట్, CC మెట్లు, ర్యాంపు ను వారు ప్రారంభించారు.

మొత్తం రూ.1.71కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

ఇది కూడా చదవండి:- కేసీఆర్ జాతీయ పార్టీకి ముహుర్తం పిక్స్..

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ గారు, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణా గారు, ఆళ్ల నీరిషా రెడ్డి గారు, దిరేపల్లి శ్వేత గారు, రాపర్తి శరత్ గారు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.