Telugu News

ఖమ్మంలో వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన సినినటి యాంకర్ అనసూయ

చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు

0

కళామందిర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ నటి & యాంకర్ అనసూయ

== చూసేందుకు భారీగ తరలివచ్చిన జనం

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

నగరంలో కస్పాబజార్ నందు నూతనంగా నిర్మించిన షాపింగ్ మాల్ ను ఆదివారం సినీ నటి & యాంకర్ అనసూయ కళామందిర్ షాపింగ్ మాల్ ను నిర్వాహకులతో కలిసి ప్రారంభించి సందడి చేసింది . అభిమానులతో సెల్ఫీలు దిగి వారి అభిమానాన్ని చాటుకుంది . తనను చూడటానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తదనంతరం మీడియా సమావేశంలో అనసూయ మాట్లాడుతూ ఖమ్మం గడ్డపై నేటి నుండి చీరల ప్రభంజనం మొదలవుతుందని, ఆడపడుచులకు మునుపెన్నడూ చూడని లక్షలాది వెరైటీలతో కనీ వినీ ఎరుగని , అత్యంత తగ్గింపు ధరలకే మీ ముందుకు తీసుకొచ్చిందని , పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ . అలాగే కంచి పట్టు , బనారస్ , ఇక్కత్ , గద్వాల్ , పటోల , కుప్పడం , ఫ్యాన్సీ డిజైనర్ , కోట , కళంకారికి పెట్టిన పేరు కళామందిర్ అని కొనియాడారు. అయితే ఖమ్మం నగరంలోకి అనసూయ వచ్చిందని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఖమ్మంలో కొంత సినిగ్లామర్ అలుమకుంది.

అందుకు సంబంధించిన పోటోలు