Telugu News

మణుగూరులో అనధికార చిట్టీల వ్యాపారం..

అమాయక ప్రజలకు కుచ్చుటోపి... సభ్యులకు పంగ నామం...

0

మణుగూరులో అనధికార చిట్టీల వ్యాపారం..

** అమాయక ప్రజలకు కుచ్చుటోపి… సభ్యులకు పంగ నామం…
** అక్రమ చిట్టీలు ఫైనాన్సల పేరుతో బడా మోసం…

** పట్టించుకోని అధికారులు…

(మణుగూరు -విజయం న్యూస్)

ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గం లోని మణుగూరు పట్టణంలో అక్రమ చిట్టీల వ్యాపారం జోరుగా యదేచ్ఛగా కొనసాగుతోంది. అమాయక గిరిజన ప్రజలను,మధ్య తరగతి ప్రజలను చిరు వ్యాపారస్తులను,సింగరేణి కార్మికులను ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి తమ వ్యాపార దందాను యదేచ్ఛగా కొనసాగిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతుల్లేని చిట్టి వ్యాపార కార్యాలయాలను ప్రధాన రహదారిపై నెలకొల్పి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తుండగా, మరి కొద్ది మంది మహిళలు తమ ఇళ్లలోనే అనధికార చిట్టీల వ్యాపారాలను నిర్వహిస్తూ కోట్లు గడిస్తున్నారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ నగర్ అశోక్ నగర్, సుందరయ్య నగర్,సమితి సింగారం,ప్రాంతాలను అడ్డాగా చేసుకొని ఎటువంటి ప్రభుత్వ అనుమతులు,నిబంధనలు పాటించకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. మాయాజాలంతో అక్రమ చిట్టీ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. పట్టణంలో కొందరు మహిళలు వస్త్ర వ్యాపారాలు నెలకొల్పి అమాయక మహిళల తో పరిచయాలను పెంచుకుని వారితో చిట్టీలు కట్టించుకుని మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. బంధువులు రక్త సంబంధీకులు తారతమ్యం లేకుండా స్నేహితులతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని ముందస్తుగా చే బదులుగా ఐదు రూపాయల నుండి పది రూపాయల వడ్డీ పేరుతో డబ్బులు ఇస్తూ తమ దందా పర్వానికి తెరలేపుతున్నారు తక్కువ వడ్డీకే డబ్బులు ఇస్తామని లక్ష నుండి పది లక్షల వరకు ప్రజలను చిట్టి లో సభ్యులుగా కొనసాగితే తే నెలవారీ వాయిదా రూపంలో చెల్లించవచ్చని ఎరగాచూపుతూ, అధిక వడ్డీల తో సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్నారు. పట్టణంలో “కాల్ మనీ” వ్యాపార చందంగా వ్యవహరిస్తూ చిట్టి పాడుకున్న సభ్యులకు డబ్బులు చెల్లించకుండా రోజుల తరబడి తమ ఇళ్ల ముందుకు తిప్పించు కుంటున్నారు ఇదేమిటని ప్రశ్నించగా వేధింపులకు గురిచేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బాధితులు గట్టిగా ప్రశ్నిస్తే పాడుకున్న డబ్బులు చెల్లించకుండా సభ్యులు కట్టిన డబ్బులతో సమయం చూసుకొని కోట్లాది రూపాయలతో రాత్రికి రాత్రే ఉడాయించిన సంఘటనలు మణుగూరులో కోకొల్లలు, ఏపీ చిట్ ఫండ్ యాక్టు1982 ప్రకారం గిరిజనేతర ప్రాంతాలలో రిజిస్టర్ చిట్ కంపెనీలు ఏజెన్సీలో వ్యాపారాలను సాగించేందుకు అనుమతులు లేవు. ప్రజా అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు మహిళలు ఇన్కమ్ టాక్స్ జిఎస్టి టాక్స్ చెల్లించకుండానే అధికారుల కళ్లుగప్పి అమాయక గిరిజన ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ప్రజలను నమ్మించి లక్ష్యాలది రూపాయలను వసూలు చేసుకొని, రాత్రికి రాత్రే భిచాన సర్ది ప్రజలకు నిలువున మోసం చేస్తూ అమాయక ప్రజలకు నిలువునా పంగనామాలు పెడుతున్నారు.

allso read :- ప్రయాణం… నిత్య నరకం…!

బాధితుల అవసరాల నిమిత్తం చిట్టి పాడుకున్న వారి నుండి ప్రాంసరీ నోటు, తెల్ల కాగితం, కాళీ చెక్కులను తీసుకొని, అమాయకులతో సంతకాలు చేయించుకొని 10 రూపాయల నుండి 30 రూపాయల వరకు వడ్డీ పేరుతో ప్రజల రక్తలను జలగల పీల్చిపిప్పి చేస్తున్నారు.పట్టణంలోని చిరు వ్యాపారులు, కార్మికుకు తమ బిడ్డల అవసరాలు, కుమార్తెల వివాహాల కోసం కష్టించి పనిచేసిననిమిత్తం ఆదాయం నుండి పైసా పైసా కూడబెట్టి నెలవారి చిట్టి లను క్రమం తప్పకుండా చెల్లిస్థు, పిల్లల ఉన్నత చదువులు పొదుపు చేసుకున్న చిట్టీ లను పాడుకొని డబ్బుల కోసం ఎదురు చూపులతో చిట్టి నిర్వాహకుల ఇంటి చుట్టూ కాళ్లరిగేలా రోజుల తరబడి తిరుగుతున్న కనికరం చూపకుండా భాదితులపైనే దౌర్జన్యానికి పాల్పడుతూ, నా నా మాటలతో దుర్భాషలాడు తుంటే ఎవరికి చెప్పాలో అర్థం కాక కుటుంబ పరువు పోతుందని కుమిలిపోతూ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు మణుగూరులో నెలకొన్నాయి అక్రమ చిట్టి వ్యాపారాలపై కొరడా జూలిపించాల్సిన అధికారులు నిద్రావస్థలో మౌనం వహిస్తుంటే ఆంతర్యం ఏమిటని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిట్టి వ్యాపారుల మాటల మాయాజాలంలో అక్రమార్కుల కబంధ హస్తాలలో చిక్కుకున్న అమాయక ప్రజలకు న్యాయం చేసి, అక్రమ చిట్టి వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని, ప్రజలు ప్రజా సంఘాల నాయకులు ముక్త కంఠంతో కోరుతున్నారు.

allso read:- షేబాస్ రవి.. ఖమ్మంలో ఆటో డ్రైవర్ నిజాయితీ..2లక్షల విలువగల బంగారం అందజేత