Telugu News

ఖమ్మం జిల్లాలో ఏసీబీ దాడుల కలకలం

తిరుమలాయపాలెం ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ చందర్ అరెస్ట్

0

ఖమ్మం జిల్లాలో ఏసీబీ దాడుల కలకలం

== ఏకకాలంలో ఐదుచోట్ల చోట్ల సోదాలు

== తిరుమలాయపాలెం ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ చందర్ అరెస్ట్

== రూ.70వేలు లంచంకోసం కాంట్రాక్టర్ ను డిమాండ్ చేసిన ఏఈ

== ఆదాయంకు మించిన ఆస్తులన్నట్లు సమాచారం

== వివరాలను వెల్లడించిన డీఎస్పీ

(ఖమ్మంప్రతినిధి, తిరుమలాయపాలెం-విజయంన్యూస్)

ఖమ్మం జిల్లాలో మరోసారి ఏసీబీ దాడుల కలకలం రేపింది. సోమవారం జిల్లాలోని ఓ ప్రభుత్వ మండలస్థాయి అధికారి నివాసంతో పాటు ఇతర నాలుగు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా, పలు కీలక పత్రాలను స్వాధినం చేసుకున్నారు.. అనంతరం సంబంధిత అధికారిని అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు.

allso read- తుమ్మల, రేగా కలిశారు..అంతర్యమేంటో..?

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మంరూరల్ మండలానికి చెందిన నునావత్ చందర్ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ఆర్ డబ్ల్యూఎస్ ఏఈగా పనిచేస్తున్నాడు. మండలంలో ఆర్ డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ పథకం పనులు జనరల్ పనులను పరిశీలించి ఎంబీ రికార్డులు చేయాల్సి ఉండగా, తిరుమలాయపాలెం మండలంలోని తాళ్లచెరువు గ్రామానికి చెందిన జి.రాజా అనే అతను కాంట్రాక్టర్ గా పనిచేస్తుండగా,  ఆర్ డబ్ల్యూఎస్ శాఖ నుంచి పలు సివిల్ వర్క్స్ పనులు చేశాడు. ఆయన తిరుమలాయపాలెం  మండలంలోని బీరోలు, హైదరాసాయిపేట, జల్లెపల్లి  గ్రామాల్లో సైడ్ డ్రైన్స్ కు సంబంధించిన సివిల్ వర్క్స్ రూ.14లక్షల విలువ చేసే పనులు చేయగా, వాటికి ఎంబీ రికార్డ్ చేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపించాల్సిన ఏఈ చందర్ రాజాను  బిల్లులో 5శాతం ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో రూ.14లక్షలకు గాను రూ.70వేలను లంచంగా డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు ఇస్తేనే పైల్స్ ను జిల్లాకు పంపిస్తానని డిమాండ్ చేశాడు. దీంతో రాజా లంచం అడిగిన వీడియో కాల్స్, ఆడియోలు, రికార్డులతో పక్కా సమాచారంతో ఏసీబీని అశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గత రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. అనంతరం సోమవారం నాలుగు టీమ్స్ ఏకకాలంలో ఐదు చోట్ల తనిఖీలు చేశారు. చందర్ నివాసంతో పాటు తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, హైదరాసాయిపేట, జల్లెపల్లి గ్రామాల్లోని జీపీల్లో సోదాలు చేశారు. అక్కడ రికార్డులను స్వాధినం చేసుకున్నారు. అనంతరం ఆర్ డబ్ల్యూఎస్ జిల్లా కార్యాలయంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు చందర్ కు సంబంధించిన పలు రికార్డ్స్ ను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న పైల్స్, పంచాయతీల్లో ఉన్న పైల్స్, ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఉన్న పైల్స్ ను సీజ్ చేశారు.

allso read- గుంటు మల్లేశ్వరుడిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర

 ఈ సందర్భంగా డీఎస్పీ పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏఈ చందర్ డబ్బులు డిమాండ్ చేస్తూ పూర్తి ఆధారాలతో వీడియో, అడియోలతో ఉన్నాయని, అందుకే కచ్చితమైన సమాచారంతో సోదాలు చేయడం జరిగిందన్నారు. వీడియో, ఆడియో ఆధారంగా కేసు నమోదు చేసిన సందర్భంగా ఏఈని అరెస్టు చేసి, మంగళవారం ఏసీబీ కోర్టులోఅప్పగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఏఈని పోలీసులు జీపు ఎక్కిస్తుండగా, చందర్ మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై కక్ష్యకట్టి ఏసీబీకి ఫిర్యాదు చేశారని, ఇంకా చాలా చెప్పాల్సి ఉందని, త్వరలోనే అన్ని తెలుస్తాయని తెలిపారు. నేను తప్పు చేయలేదని, నిజనిజాలు మీకే తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

== సర్పంచులను, కాంట్రాక్టర్లను పీడిస్తున్నాడా..?

ఆర్ డబ్ల్యూఎస్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న చందర్ తిరుమలాయపాలెం మండలంలోని పలువురు సర్పంచ్ లను పనులు చేసిన వాటికి బిల్లులు మంజూరు చేయాల్సి ఉండగా, 5శాతం లంచంగా ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తానని సర్పంచులు, చిన్నచిన్న కాంట్రాక్టర్లను వేదిస్తాడని పలువురు సర్పంచులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వందే బిల్లు అయ్యేది కాదని, ముందుగా తన చేయితడిపితేనే బిల్లు జిల్లాకు వెళ్తుందని, ఆ విధంగా చాలా ఇబ్బందిపెట్టేవాడని పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

== బినామీలతో మిషన్ భగీరథ పనులు..?       allso read- సీఎం కేసీఆర్ పై తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

తిరుమలాయపాలెంలో పనిచేసే ఏఈ చందర్ గ్రామాల్లో జరిగే మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు, ట్యాంక్ ల నిర్మాణ పనులు ఆయనే కాంట్రాక్టర్ గా మారి బినామీల పేరుతో పనులు చేయించేవాడని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో నిర్మాణం చేసే ఇంటింటికి నల్లా కనెక్షన్ పనులు, ట్యాంకుల నిర్మాణ పనులు, ఇతరత్ర పనులు కూడా బినామిల పేరుతో ఆయన స్వంత డబ్బులతో పనులు చేయించేవాడనే ప్రచారం జరుగుతోంది. అందుకే అతి తక్కువ కాలంలోనే భారీగా ఆధాయం గడించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

== అక్రమ అస్తులున్నాయా..?

మూడు రోజుల ముందుగా వీడియో, ఆడియో ఆధారంగా కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఏఈ చందర్ పై  నిఘా పెట్టారు. అలాగే ఆయన అస్తులపై ఆరా తీశారు. ఆధాయంకు మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిషన్ భగీరథ పథకంలో జరిగే అభివద్ది పనులతో పాటు ఆర్ డబ్ల్యూఎస్ పథకంలో జరిగే చిన్నచిన్న కాంట్రాక్ట్ పనులన్ని చందర్ బినామిల పేరుతో వర్కులు తీసుకుని చేసేవాడని తెలుస్తోంది. సర్పంచులకు కనీసం రవాణా భత్యాలు కూడా ఇవ్వకుండా బినామిల పేరుతో వర్కులు చేయించి, ఎక్కడ కూడా నాణ్యత లేకుండా పనులు చేసేవాడని ఆరోపిస్తున్నారు. మొత్తానికి చందర్ చేసిన చిన్నచిన్న తప్పిదాలు ఆయనకు శాపంగా మారాయనే చెప్పాలి.