Telugu News

ఖమ్మం జిల్లా హీరో,హీరోయిన్ నటించిన సినిమా ఇది..అదరించండి: చిత్రయూనిట్

డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "నమస్తే సేట్ జీ" మూవీ సినిమా.

0

“నమస్తే సేట్ జి” సినిమాను ప్రజలు ఆదరించండి

== డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “నమస్తే సేట్ జీ” మూవీ సినిమా.

== కిరాణా కొట్టు సేటు జీవితాన్ని కథగా తీసుకొని నిర్మించాం..

== కరోనా సమయంలో సాఫ్ట్వేర్ నుండి సామాన్యుడి వరకు పడిన కష్టాలను ఫ్రంట్ లైన్ వారియర్ కృషిని ఈ సినిమాలో చూపించాం.

== హీరో హీరోయిన్ ఖమ్మం జిల్లా కి చెందినవారమే ఈ ప్రాంత ప్రజలు ఆదరించండి.

== వాస్తవ పరిస్థితులు నిజజీవన విధానాల ఆధారంగా తీసిన సినిమా ఈ నమస్తే సే ట్ జి సినిమా..

== మధిరలో “నమస్తే సేట్ జి” ప్రమోషన్ ప్రెస్ మీట్ లో హీరో సాయి కృష్ణ, స్వప్న చౌదరి

(చిత్రవిభాగం-విజయంన్యూస్)

ఈనెల 9న తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదల కాబోతున్న మా సినిమా నమస్తే సేట్ జి సినిమా ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించాలని ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రాంత ప్రజలు ఆదరించాలని సినిమా హీరో ప్రొడ్యూసర్ సాయి కృష్ణ గుప్తా హీరోయిన్ స్వప్న చౌదరి కోరారు. ఈరోజు శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ థియేటర్కు ఈ సినిమా ప్రమోషన్ కోసం సినిమా యూనిట్ తో కలిసి వచ్చారు ఈ సందర్భంగా మేనేజర్ భక్తులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హీరో సాయి మాట్లాడుతూ చిల్లర కొట్టు లో సే ట్ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమాను నిర్మించడం జరిగిందని వారు తెలిపారు.

ఇది కూడా చదవండి: గాయంతో బాధపడుతుంది..? అయినప్పటికి రజతం గెలిచింది

వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వాస్తవ జీవన విధానానికి దగ్గరగా నిత్యం మన కళ్ళ ముందు కనిపించే సరదా కామెడీ కలిసి ఈ మూవీలో చూపించడం జరిగింది. ఇప్పటికే నేను నాలుగు సినిమాలు నటించి నిర్మించడం జరిగిందని వారు తెలిపారు. ముఖ్యంగా ఫ్రెండ్లీ పోలీస్ షార్ట్ ఫిలిం తీసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తమ అవార్డు అందుకోవటం జరిగిందని హీరో సాయి కృష్ణ తెలిపారు. ఎంతో కష్టపడి వేయప్రయాసులకు రాజీ పడకుండా మంచి కమర్షియల్ మూవీని తీయడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా నేను ఖమ్మం జిల్లా వాసిన కావటం నాతోపాటు పనిచేసిన హీరోయిన్ స్వప్న చౌదరి మన ఖమ్మం జిల్లా కావటం మనందరికీ ఆనందం. తెలుగు రాష్ట్రాల్లో మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్వప్న మొదటిసారిగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా టైలర్ రిలీజ్ చేసుకొని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 40 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శించబడుతుందని హీరో సాయి తెలిపారు. ఈ సమావేశంలో వారి వెంట కుంచెం కృష్ణారావు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస థియేటర్ యజమాని చేడే కృష్ణ, డాన్స్ మాస్టర్ ఉమా, షార్ట్ ఫిలిం డైరెక్టర్ సమీర్, నటుడు శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి: బంగ్లాపై టీమిండియా ఘోర పరాజయం