Telugu News

ఈ నెల 24న ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీని సక్సెస్ చేద్దాం 

తిరుమలాయపాలెం మండల జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్

0

ఈ నెల 24న ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీని సక్సెస్ చేద్దాం 

▪️ *తిరుమలాయపాలెం మండల జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్

(తిరుమలాయపాలెం -విజయం న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజీతో విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయని, ఆ పేపర్ లీకేజీకి సంబంధించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తిరుమలాయపాలెం మండల జెడ్పీటీసీ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి 9ఏళ్ళు కావస్తున్నా దేశ, రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పులు రాలేదని, దేశ ప్రజలందరు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గెలిచిన తరువాత లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులందరికి ఉద్యోగం వస్తుందని, ఉద్యోగం రాని వారికి రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారని అన్నారు. ప్రచార ఆరాటమే తప్ప ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదన్నారు. అంతే కాకుండా ఉద్యోగ పరీక్షలంటూ ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆ తరువాత డ్రామాలు ఆడుతూ మోసం చేసిందన్నారు. మభ్యపెట్టే కార్యక్రమమే తప్ప మరొకటి లేదని, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఈ నెల 24న నిరుద్యోగుల సమస్యల కోసం *నిరుద్యోగర్యాలీ* నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ దీక్షకు నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యి విజయవంతం చేయగలరని కోరుచున్నాము.