Telugu News

ఖమ్మంలో మంకీఫాక్స్ లక్షణాలు లేవు : డీఎంఅండ్ హెచ్వో

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నమ్మోద్దు

0

ఖమ్మంలో మంకీఫాక్స్ లక్షణాలు లేవు : డీఎంఅండ్ హెచ్వో

== సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నమ్మోద్దు

ఖమ్మంప్రతినిధి, జులై 26(విజయంన్యూస్)

ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలంలో మంకీఫాక్స్ లక్షణాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖమ్మం డీఎంఅండ్ హెచ్ వో డాక్టర్ మాలతి ఖండించారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు, మీడియాలో వస్తున్న కథనాలకు ఆమె స్పందించారు. కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తను పోస్ట్ చేయడం వల్ల అది అన్ని గ్రూపులలో పార్వోర్డ్ అయ్యిందని, అందుకు అందరు కొంత సమాచారం లేకపోవడం వల్ల తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఎలాంటి మంకీఫాక్స్ లక్షణాలు లేవని, తప్పుడు ప్రచారాలను నమ్మోద్దని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఖమ్మం రూరల్ మండలంలోని అరెంపుల గ్రానైట్ ప్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు సందీప్ చిన్న ఆరోగ్య కారణాల వల్ల ఆసుపత్రికి వచ్చారని, ప్యాక్టరీలో పనిచేస్తుండటం వల్ల ఆయనకు కొంత ఆరోగ్య సమస్య వచ్చిందన్నారు. అంతేకానీ అతనికి మంకీఫాక్స్ లక్షణాలు లేవని, ఎవరు నమ్మోద్దని సూచించారు. తప్పుడు ప్రచారాలు చేయోద్దన్నారు.

allso read- అరెంజ్ అలార్ట్ హెచ్చరిక