Telugu News

సీఎం కేసీఆర్ కోసం ఖమ్మంలో పూజలు

ఖమ్మం-విజయంన్యూస్)

0

సీఎం కేసీఆర్ కోసం ఖమ్మంలో పూజలు
(ఖమ్మం-విజయంన్యూస్);-
తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఖమ్మం నగరంలోని బ్రాహ్మణ బజార్ లోగల భ్రమరాంబ సహిత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో తెరాస నాయకులు, శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు ఆరోగ్య సిద్ధి చేకూరాల‌ని, ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించారు. శుక్రవారం హైదరాబాద్ లో అస్వస్తతకు గురైయ్యారు. కాగా ఆయన్ను తక్షణమే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందించారు.

also read :-పంచాయతీ సెక్రటరీలకు కొత్త బాధ్యతలు

దీంతో కొద్ది గంటల తరువాత ఆసుపత్రి నుంచి డిచ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం పర్వాలేదని వైద్యులు తెలిపారు. కాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని టీఆర్ఎస్ నాయకులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డౌలే లక్ష్మీ ప్రసన్న, కార్పొరేటర్ మాడూరి ప్రసాద్ నాయకులు సైదారావు, సాయి కిరణ్, ఉస్మాన్, జానీ, త్రిలోక్, జాన్ బాషా, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.