Telugu News

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి సేవలు భేష్

సీఎం కేసీఆర్, మంత్రి అజయ్ లకు గర్భిణీ స్త్రీలు కృతజ్ఞతలు 

0

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి సేవలు భేష్

 సీఎం కేసీఆర్, మంత్రి అజయ్ లకు గర్భిణీ స్త్రీలు కృతజ్ఞతలు 

(ఖమ్మం విజయం న్యూస్);-

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే చాలా మంది ఆలోచిస్తారు. మంచి వైద్యం అందాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి ఆసక్తి చూపుతారు. మరీ ముఖ్యంగా ప్రసవాల విషయంలో చాలా మంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. ఇదంతా ఒకప్పటి మాట. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు.

also read :-మీ బైక్‌పై పెండింగ్ చ‌లాన్లు ఉన్నాయా?

మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ చికిత్సలు అందిస్తుండటంతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది నేటి పరిస్థితి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలు మెరుగపడుతున్నాయి. వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి ఆరోగ్య సూచనలు, సలహాలు అందిస్తున్నారు.

స్వరాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. ఇదే కోవలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి రూపుదిద్దుకున్నది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో ప్రసూతి విభాగంలో సకల సౌకర్యాలు కల్పించారు. ప్రైవేట్‌కు దీటుగా సేవలందిస్తున్నారు. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి సేవలు పొందిన పలువురు మహిళలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లకు గర్భిణీ స్త్రీలు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా దవాఖానలో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు తీసిపోనివిధంగా అన్ని విభాగాల వార్డులను తీర్చిదిద్దారు. ఐసీయూ, డయాలసిస్‌, బ్లడ్‌ బ్యాంకు, క్యాద్ ల్యాబ్, ఈ-ఐసీయూ, కొవిడ్‌ వార్డు, ఆక్సిజన్‌ ప్లాంట్‌, ఎల్‌వోటి, స్కానింగ్‌ సెంటర్‌ తదితర అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చా రు. సీటీజీ మెషిన్‌, ఫీటల్‌ డాప్లర్‌, అల్ట్రాసౌండ్‌ మెషిన్‌, అధునాతన ల్యాబొరేటరీ, హైడ్రాలిక్‌ ఆపరేషన్‌ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. బరువు తక్కువ ఉండి, పసిరికలతో బాధపడుతున్న నవజాత శిశువుల చికిత్స కోసం ఎన్‌బీఎస్‌యూను నెలకొల్పారు. సాధారణ ప్రసవాలు చేసేందుకే ప్రాధాన్యతనిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రోజు వారీగా వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకంతో పాటు గైనిక్‌ విభాగంలో అందిస్తున్న మెరుగైన వైద్య సేవలతో ప్రజల్లో అపారమైన నమ్మకం ఏర్పడింది. పీహెచ్‌సీల్లో గర్భిణులకు నెలనెలా పరీక్షలు చేసి అవసరమైన మం దులు ఇస్తున్నారు. అమ్మ ఒడిలో భాగంగా 102 అంబులెన్సుల్లో కాన్పు కోసం వచ్చిన మహిళలను సురక్షితంగా ఇటు దవాఖానకు, అటు ఇంటికి తరలిస్తున్నారు.