Telugu News

‘ఖమ్మం గుమ్మం’ గులాబీ మయం

భారీగా ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ పార్టీ

0

‘ఖమ్మం గుమ్మం’ గులాబీ మయం
== ఎక్కడ చూసిన గులాబీ రంగు జెండాలు, ప్లెక్సీలు

== భారీగా ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ పార్టీ

== సభా ప్రాంగణాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రులు తన్నీరు, పువ్వాడ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం జిల్లా గులాబీమయమైంది. ఎక్కడ చూసిన హోర్డింగ్ లు, జెండాలు, ప్లెక్సిలు.. ముఖ్యంగా ఖమ్మం నగరంలోని ఇరువైపుల గులాబీ రంగు గుబెలుమనిపిస్తుంది. ఎక్కడ చూసిన బీఆర్ఎస్ గురించే చర్చ. ఎక్కడ చూసిన ప్లెక్సీలు, కటౌట్లతో రోడ్లన్ని నిండిపోతున్నాయి. ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారులు, ఖమ్మం నగరంలోని జాతీయ రహధారులు ప్లెక్సిలతో నిండిపోయాయి. అలాగే 13 నియోకవర్గాలను టార్గెట్ చేసుకుని జన సమీకరణ చేస్తున్న సందర్భంగా అక్కడ ప్లెక్సీలు, వాల్ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు ఊహించని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

== సభా ప్రాంగణం వద్ద భారీ ఏర్పాట్లు

ఖమ్మం నగరంలోని రఘునాథపాలెం మండలం శివారులోని వీవీపాలెం సమీపంలో నూతన కలెక్టరేట్ పక్కనే 100 ఎకరాల్లో సభావేదికను ఏర్పాటు చేస్తుండగా, మరో 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సభా వేదికను అద్భుతంగా అలంకరించారు. సభా ప్రాంగణం ప్రారంభం నుంచి ముగింపు వరకు, అలాగే నూతన కలెక్టరేట్ వరకు ఎక్కడ చేసిన ప్లెక్సీలు, కౌటవుట్లే  కనిపిస్తున్నాయి.

allso read- చరిత్ర తిరగరాస్తున్న ‘ఖమ్మం కలెక్టరేట్’

గ్రౌండ్ మొత్తం బ్యానర్లతో నిండిపోయింది. పదుల సంఖ్యలో బెలూన్స్ ను ఏర్పాటు చేశారు.  సభా ప్రాంగణాన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తున్నారు. ఎక్కడ, ఎప్పుడు చూడని విధంగా కనివిని ఎరుగని రితీలో  ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా 26 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీ, మీడియా పాయింట్, లాడ్జెస్ట్ స్క్రీన్స్, అందరు చూసే విధంగా సభావేదికను ఏర్పాటు చేశారు. సుమారు 5లక్షల మంది జనాలను తరిలించే ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకు సంబంధించిన రూట్ మ్యాఫ్ ను కూడా పోలీసుల విడుదల చేశారు.

== 26 సెంటర్లలో పార్కింగ్ ఏర్పాటు

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహుబూబాబాద్, సూర్యపేట, ములుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నందున వారందరికి ఎలాంటి అసౌఖర్యాలు జరగకుండా పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను సభ ప్రాంగణానికి అత్యంత సమీపంలో 250 ఎకరాల్లో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. అందుకు కావాల్సిన వాహనాలను వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోకి వెళ్లేందుకు క్యూఆర్ కోడ్ ను కూడా అన్ని వాహనాల డ్రైవర్లకు పంపించనున్నారు. దీంతో నేరుగా వారు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా వారికి కేటాయించిన జిల్లా పార్కింగ్ ప్రదేశానికి వాహనం వెళ్లనుంది. అలా చాలా పకడ్భందిగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ రూట మ్యాఫ్ లో చెప్పిన విధంగా వాహనాలను వారికి కేటాయించిన స్తలంలో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు.

== సభా వేదికలను పరిశీలించిన మంత్రులు

ఖమ్మం నగరంలో ఈనెల 18న జరిగే బహిరంగ సభకు భారీగా జనసమీకరణ జరుగుతున్న నేపథ్యంలో పలువురు నాయకుల ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఇంచార్జ్ గా వచ్చిన రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు.

allso read- నేడు ఖమ్మంలో ‘చంద్ర’ గర్జన

వారితో పాటు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతామధుసూదన్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, గాయత్రి రవి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరర్ రెడ్డి, కౌసిక్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు  నిరంతరం పర్యవేక్షణ చేస్తుండగా, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతిరాథోడ్ పరిశీలించారు. ఇక తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, గాయత్రి రవి, ఎమ్మెల్సీలు తాతామధుసూదన్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు నిత్యం గ్రౌండ్ వద్దనే ఉంటూ పొద్దుగల, రాత్రి అనేది లేకుండా నిరంతరం పనిచేస్తున్నారు. సభా స్థలి వద్ద ఏర్పాట్లు క్షుణంగా పరిశీలిస్తున్నారు. కలెక్టర్ మొత్తం కలియతిరిగారు. పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం సభా వేదిక వద్ద నడుచుకుంటూ ఏర్పాట్లను పరిశీలించారు.