నవ్వుల వర్షం కురిపించి హైపర్ అది
== పాటలతో అలరించిన సింహ టీమ్
== సర్థార్ పటేల్ స్టేడియంలో అంబరాన్ని అంటిన ‘ఖమ్మం సంబరాలు’
== అకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
== హాజరైన ఎమ్మెల్యే సండ్ర, కలెక్టర్, సీపీ దంపతులు
ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 18(విజయంన్యూస్)
జబర్థస్ ఫేమ్ హైపర్ అది పంచులే పంచులు.. కడుపుబ్బ నవ్వించిన కమిడియన్లు.. అద్భుతమైన జాతీయ గీతాలతో అలరించిన సింగర్ సింహ టీమ్.. ఆటపాటలతో సందడి చేసిన యువత.. ఊర్రూతలూగించే పాటలతో డ్యాన్స్ లు చేసిన జనం.. ఆ ఊపులో డ్యాన్స్ చేసిన కలెక్టర్, సీపీ.. ఖమ్మం సర్థార్ పటేల్ స్టేడియం ఆటపాటలతో దద్దరిల్లింది. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన ఖమ్మం సంబురం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.. సుమారు 4గంటల పాటు జరిగిన కార్యక్రమాన్ని వేలాధి మంది జనం సందోహం నడుమ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది.
ఇది కూడా చదవండి: –ఖమ్మం నగర అభివృద్దే నా లక్ష్యం: మంత్రి పువ్వాడ
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఖమ్మం సర్థార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన ‘ఖమ్మం సంబురం’ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ఆదివారం ‘ఖమ్మం సంబురం’ పేరుతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ వి.పి.గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్, ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా యువతియువకులు సంస్కృతి, సంప్రధాయంలో భరతనాట్యం, కూచపూడి తదితర నాట్యాలను వేసి అలరించారు.
== నవ్వినవ్వి కడుపుబ్బిన హైపర్ అతి పంచులు
ఖమ్మంలో జరిగిన ఖమ్మం సంబరాలకు జబర్థస్త్ ఫేమ్ హైపర్ అది, ఆయన టీమ్ సభ్యులు హాజరైయ్యారు. అది ప్రారంభం నుంచే పంచులు వేస్తూ అద్భుతమైన కామెడితో అకట్టుకున్నాడు. హైపర్ అది పంచులతో కార్యక్రమానికి వచ్చిన జనం నవ్వినవ్వి కడుపుబ్బిపోయిందంటే నమ్మండి. అలా పంచులపై పంచులతో హైపర్ అది జనాల నుంచి నవ్వుల పువ్వులు కురిపించారు.
ఇది కూడ చదవండి: – ఇద్దరు ఎంపీలకు, ఎమ్మెల్సీకి అవమానం
== అకట్టుకున్న పాటలు
ఖమ్మం సంబరాలకు ముఖ్యఅతిథులుగా వచ్చిన సింగర్ సింహ అండ్ టీమ్ సభ్యులు అద్భుతంగా పాటలను పాడి అకట్టుకున్నారు. జాతీయ గీతాలు, సినిమా పాటలతో అద్భుతంగా అకట్టుకున్నారు. సింహ పాడే పాటలకు జనం ఊర్రూతలు ఊగి డ్యాన్స్ లు వేశారు. వారి పాటలకు మంత్రముగ్దులైన కలెక్టర్ వి.పి.గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ డ్యాన్స్ లు చేసి అలరించారు.యువతి యువకులు వారికి అడుగులో అడుగులు వేస్తూ ఈలలు వేస్తూ గోల చేస్తూ అలరించారు. దీంతో ఖమ్మం సర్థార్ పటేల్ స్టేడియం ఆటపాటలతో మారుమోగింది. అనంతరం పలువురు స్వాతంత్ర సమరయోదులను, ప్రముఖులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ వి.పి.గౌతమ్, సీపీ విష్ణు ఎస్.వారియర్ ఘనంగా సన్మానించారు.