Telugu News

ఖమ్మంలో మిరుమిట్లుగొలుపుతున్న తీగల వంతెన

== చూసేందుకు తరలివస్తున్న జనం

0

ఖమ్మంలో మిరుమిట్లుగొలుపుతున్న తీగల వంతెన
== చూసేందుకు తరలివస్తున్న జనం
== రద్దీగా మారిన ట్యాంక్ బండ్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఇదో అద్భుతం.. ఖమ్మం జిల్లా చరిత్రలోనే నిజంగా అద్భుతం.. చిన్న పాటి చెరువులో మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు.. నీటిపై విరజిమ్ముతున్న రంగుల వెలుగులు.. చక్కని మ్యూజిక్.. అహ్లాదాన్ని పంచే చల్లటి వాతావరణం.. అబ్బో చూస్తుంటూనే మనుసు ఉప్పెంగిపోయే అద్భుతం ఖమ్మం నగరంలో కనువిందు చేస్తోంది.. ఖమ్మం నగర అభివద్ధి విషయంలో పరుగులు పెడుతోంది అనడానికి ఇదే పెద్ద నిదర్శనం. ఇప్పటికే ఖమ్మం నగరంలో వాటర్ ఫాల్, చౌరస్తాల్లో అద్భుతమైన రహదారులు, నగరంలో ఎప్పుడు చూడని విద్యుత్ వెలుగులు.. రోడ్డుకు రోడ్డు మధ్య ప్రత్యేక అకర్షనీయమైన బొమ్మలు, అందమైన చెట్లు.. రింగురోడ్డులో అద్భుతమైన బొమ్మలు, మహానీయులను స్మరించుకునే విగ్రహాలు.. అకట్టుకునే విధంగా లైటింగ్స్ తో ఖమ్మం నగరం ఎంతో అభివద్ధి సాధించిందనే చెప్పాలి..

also read :-రూ 7.36 కోట్లు రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ : ఏడీఏ విజయ్ చంద్ర

ఎన్ఎస్ పీ కాలువులు, గొళ్లపాడు చానల్, మురుగు కాలువలను సైతం సుందరంగా మార్చిన ఘనత మంత్రి పువ్వాడకే దక్కిందని చెప్పాలంది. ఎన్ఎస్ పీ కెనాల వద్ద పార్కింగ్, వాకింగ్ ట్రాక్, అందంగా పార్కులుగా, అందమైన పుట్ పాత్ లు ఇలా చెప్పుకుంటూ పోతే ఖమ్మం నగరంలో అన్ని అద్భుతమే అన్నట్లుగా చేశారు. అయితే ఖమ్మం నగరానికి వన్నె తెచ్చిన లకారం ట్యాంక్ బండ్ ఇప్పటికే ఎంతో అద్భుతమైన పేరు తీసుకొచ్చింది. కాగా ఇప్పుడు మిరుముట్లు గొలిపై విద్యుత్ వెలుగులతో నిర్మాణం చేసిన తీగల వంతెన ఖమ్మంకు మరో ప్రాఖ్యాతను తీసుకొచ్చిందనే చెప్పాలి. మిరుమిట్లు గొలుపుతున్న విద్యుత్ వెలుగులను చూసేందుకు పర్యటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పర్యటకులతో, యువకులతో సందడిగా మారింది..సాయంత్రం సమయంలో వందలాధి మంది ఖమ్మం వాసులు తరలివచ్చి తిలకిస్తున్నారు. తీగల వంతెన నుంచి వస్తున్న మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులను తమ సెల్ పోన్ లో బందిస్తూ సందడి చేస్తున్నారు.