ఖమ్మం కాంగ్రెస్ కు షాకిచ్చిన కార్పోరేటర్
== గులాబీ గూటిలో చేరిన 60వ డివిజన్ కార్పోరేటర్
== కండువ కప్పి స్వాగతించిన మంత్రులు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్, జూనియర్ అంటూ రెండు వర్గాలుగా విడిపోయి పోట్లాటపడుతుంటే, దిగువున ఉన్న ప్రజాప్రతినిధులు వారి దారి వారు చూసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పక్షాన చేరిపోతున్నారు. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని 60 డివిజన్ పరిధి కార్పోరేటర్ నిరంజన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటిలో చేరిపోయారు. ఆయన శుక్రవారం ఇద్దరు మంత్రుల సమక్షంలో పార్టీలో చేరగా మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్,పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కండువ కప్పి స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: ‘అమాత్యుల’ వ్యాఖ్యలు ఎవరికి గుణపాలు..?
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒక వైపు రాష్ట్రం మొత్తం గులాబీ వైపు ఫలితాలు వస్తున్న క్రమంలో గత కొద్ది నెలల క్రితం జరిగిన ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి.. మొత్తం 60 స్థానాలకు గాను సుమారు 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అందులో ఇద్దరు కార్పోరేటర్లు గెలిచిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటిలో చేరిపోయారు. అనంతరం మరికొద్ది రోజుల తరువాత మరో కార్పోరేటర్ గులాబీ పార్టీలో చేరగా, ప్రస్తుతం కొద్దినెలల నుంచి కొందరు కార్పోరేటర్లు నిశబ్ధం మెయింటెన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో హాజరుకావడం లేదు. అయితే అందులో 60వ డివిజన్ కార్పోరేటర్ తన కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే జాతీయ పార్టీగా అవిర్భవించిన అనంతరం ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన మొటమొదటి కార్పోరేటర్, ప్రజాప్రతినిధి నిరంజన్ కావడం గమనర్హం.
ఇది కూడా చదవండి: ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి
ఈ సందర్భంగ నిరంజన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివద్ది, సంక్షేమ పథకాలకు అకర్షితుడనై, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న అభివద్ది పనులకు అకర్షితుడనై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. 60వ డివిజన్ అభివద్ది కోసం పార్టీలో చేరానని, అడగ్గానే అతిపెద్ద రోడ్డును మంజూరు చేసిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి, అలాగే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. 60వ డివిజన్ డెవలఫ్ మెంట్ కోసం సహాకరించాలని కోరారు.