ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తనిఖీ చేసిన కలెక్టర్
(ఖమ్మం-విజయం న్యూస్);-
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మతా శిశు సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ శుక్రవారం సందర్శించి తల్లి పాల సేకరణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. మాత శిశు సంరక్షణ కేంద్రంలో ఆసుపత్రిలో ప్రసవించి తమ శిశువుకు అవససరమైన పాలకంటే అదనంగా వచ్చే తల్లుల నుంచి పాలను సేకరించి నిలువ ఉంచే డిప్ ఫ్రీజర్లు, ఇతర సామాగ్రిని కలెక్టర్ పరిశీలించి వైద్య అధికారులను పరికరాల వినియోగం వివరాలను అడిగి తెలుసుకున్నారు.జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఆర్.ఎం.ఓ బి.శ్రీనివాసరావు, టి.ఎస్.ఎం.ఎస్.ఐ. డి.సి ఇ.ఇ ఉమామహేశ్వరరావు, డాక్టర్ పవన్ తదితరులు పాల్గొన్నారు.