Telugu News

ఒకే ఒక్కడు.. ** ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని తానై నడిపించిన మంత్రి.

* టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపు కోసం తండ్రి పాత్రపోషించిన మంత్రి

0

ఒకే ఒక్కడు..
** ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని తానై నడిపించిన మంత్రి
** టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపు కోసం తండ్రి పాత్రపోషించిన మంత్రి
** ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఐక్యం చేసి ఏకతాటిపై ఉన్నామని సాటి చెప్పిన నేత
** నేనున్నాంటూ ప్రజాప్రతినిధులకు భరోసా కల్పించిన పువ్వాడ
** ఆయన భరోసాతోనే తాతా మధు వైపు మొగ్గిన ప్రజాప్రతినిధులు
** మంత్రి చొరవను చూసి హర్షం వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అన్ని తానై నడిపించాడు రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. అభ్యర్థి ఎంపిక అనంతరం గెలుపు బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని నిత్యం పర్యవేక్షణ చేస్తూ పనిచేశారు.. ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను ఐక్యం చేసే విషయంలో సఫలమైయ్యారు.. మేమంతా ఏకతాటిపైనే ఉన్నామంటూ, మాలో మాకు వర్గాలు లేవంటూ సాటిచెప్పేందుకు ప్రయత్నం చేసిన నాయకుడు మంత్రి పువ్వాడ.. సామాన్య నాయకుడి నుంచి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు ఆయన సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేశారు..

ఎవరు ఇబ్బంది పడోద్దని, అందరికి అండగా ఉంటానంటూ మీఅందరికి నేనున్నానంటూ భరోసా కల్పించి ఒప్పించిన నేత పువ్వాడ. ఆయన భరోసాతో ఓటర్లలో మనో దైర్యం రావడమే కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించేందుకు ఓటర్లు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన కష్టాన్ని చూసిన టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ పదవికాలం ముగియడంతో ఆయన స్థానంలో ఎన్నికలకు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్థానానికి అత్యధికంగా ఓట్లు ఉండటంతో ఈజీగా గెలిచే సీటు అని భావించి చాలా మంది టీఆర్ఎస్ ఆగ్రనాయకులు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎలాంటి పదవి లేకుండా పార్టీలోనే పనిచేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి పెద్ద నాయకుల వర్గీయులు ఎమ్మెల్సీ సీటు వస్తుందని భావించారు.

అలాగే ప్రస్తుత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కొండబాల కోటేశ్వరరావు, గాయత్రిరవి, తాటి వెంకటేశ్వర్లు, బొమ్మరరామూర్తి, మద్దినేని స్వర్ణకుమారి లాంటి వారు ప్రయత్నం చేశారు. అందులో గాయత్రి రవికి సీటు వచ్చే అవకాశం ఉందని చివరి వరకు ప్రచారం జరిగినప్పటికి చివరి నిమిషంలో తాతామధుసూధన్ పేరును సీఎం కేసీఆర్ ఖారారు చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా వర్గపోరు భగ్గుమంది.. ఎవరు రోడ్లేక్కపోయినప్పటికి లోలోపల మాత్రం తాతామధుకు టిక్కెట్ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలియకుండా వారిని కనీసం సంప్రదించకుండా తాతామధుకు టిక్కెట్ కేటాయించారనే ఉద్దేశ్యంతో జిల్లాలోని బడా ప్రజాప్రతినిధులు ఆగ్రహంతో ఉండగా, వారి వర్గీయులు మాత్రం బుసలుకొట్టారు. దీంతో నామినేషన్ సమయం రావడంతో మొదటి రోజు కొంత మంది ఎమ్మెల్యేలు హాజరుకావడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన రాజకీయ చక్రం తిప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను, గాయత్రి రవిని పిలిపించి అందరికి షాక్ ఇచ్చారు. వారందరు నామినేషన్ కార్యక్రమంలో హాజరైయ్యారు.

కానీ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మట్టా దయానంద్, తాటి వెంకటేశ్వర్లు, జలగం వెంకట్రావ్, మదన్ లాల్ మాత్రం హాజరు కాలేదు. అయితే ఏదో జరిగే అవకాశం ఉందని భావించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన రాజకీయ చాణుక్యతకు పదను పెట్టారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులందరికి మంత్రి స్వయంగా పోన్లు చేసి పిలిపించుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే అభ్యర్థి తాతా మధుసూధన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరర్ రెడ్డి అసమ్మత్తిగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణను కలిసి సహాకరించాలని కోరడంలో మంత్రి వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
** గోవా ఆలోచన మంత్రిదేనా..?
ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించాలంటే ప్రజాప్రతినిధులకు మంచి చేయాలని ఆలోచించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంఫ్ కు ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఓ మంచి టూరిస్ట్ ఏరియాకు తీసుకెళ్లాలని భావించిన ఆయన గోవా అయితే బాగుంటుందని భావించి అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అక్కడైతే ప్రజాప్రతినిధులు క్యాంఫ్ నుంచి తప్పించుకునే అవకాశం ఉండదు.. పోన్లలో టచ్ ఉండే అవకాశం ఉండదు, అక్కడ ప్రజాప్రతినిధులకు భరోసా కల్పించే అవకాశం ఉంటుందని భావించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటర్లందర్ని దగ్గరుండి నియోజకవర్గాల వారిగా గోవాకు తరలించారు. చాలా పకడ్భందిగా అందరు వచ్చే విధంగా ప్లాన్ చేసి, నాయకత్వానికి సూచనలు చేస్తూ ముందుకు నడిపించినట్లు తెలుస్తోంది. క్యాంఫ్ కు తరలించిన తరువాత గోవా ప్రభుత్వ ప్రతినిధిగా ఇతర కార్యక్రమాలకు హాజరైన మంత్రి, క్యాంఫ్ కు వెళ్లి ప్రజాప్రతినిధులతో అప్యాయతగా మాట్లాడంటం, వారందర్ని కలుపుకుని పోవడం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామినివ్వడం లాంటి పనులు చేసినట్లు తెలుస్తోంది. వ్యతిరేకంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వారికి అనుకూలంగా మార్చుకునే విషయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సక్సెస్ సాధించారని తెలుస్తోంది.
** ఒకే ఒక్కడిగా ..
క్యాంఫ్ కార్యాలయం నుంచి ఖమ్మం వచ్చిన ఓటర్లను భక్తరామదాసు కళాక్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేయించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నియోజకవర్గాల వారిగా ఓటర్లకు సూచనలు సలహాలను చేస్తూ, ఒక్కోక్క నియోజకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించి వారిని సమన్వయం చేసుకున్నారు. అలాగే పోలింగ్ బూత్ వరకు ఒక్కోక్క నియోజకవర్గం ఓటర్లను ఆయనే ముందు నడిస్తూ తీసుకొచ్చి పోలింగ్ కేంద్రంలోకి పంపించి, ఆ తరువాత మరో నియోజకవర్గం వారిని తీసుకోస్తూ చాలా క్రమశిక్షణగా ఓటు వేయించడంలో మంత్రి సక్సెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఆ క్రమశిక్షణ వల్లనే మంచి ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.

** కమ్యూనిస్టులతో సందిచేయడంలో సక్సెస్:-

ఖమ్మం జిల్లాలో జరిగే ప్రతి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల పాత్ర చాలా కీలకమే. వారి ప్రభావం చాలా వరకు ఉంటుంది. పోరాటాల్లో కాంగ్రెస్ తో ఉండే కమ్యూనిస్టు పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదు. అందుకే ముందుగానే పసిగట్టిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తక్షణమే వారికి మొదటి నుంచి అనుబంధంగా ఉంటున్న సీపీఐ పార్టీ నాయకులను కలిసి మద్దతు కూడగట్టడంలో మంత్రి పువ్వాడ సూపర్ సక్సెస్ సాధించారు. సీపీఐ పార్టీకి జిల్లాలో 36 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పడితే టీఆర్ఎస్ కు పెద్ద ప్రమాదమే అని భావించిన మంత్రి ముందుగానే ఒప్పందం చేయించుకుని మద్దుతు కూడగట్టారు. అలాగే సీపీఎం పార్టీని కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకుండా సైడ్ ట్రాక్ పట్టించడంలో సఫలమైయ్యారనే ప్రచారం జరుగుతుంది. సీపీఎం పార్టీ గత కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగింది.

పోరాటంలో కూడా కాంగ్రెస్ తోనే ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో కచ్చితంగా ఓట్లన్ని కాంగ్రెస్ కు పడే అవకాశం ఉండటంతో, వారిని ఎవరికి మద్దతు లేకుండా ఓట్లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించే విషయంలో మంత్రి పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కూడా మంత్రి సక్సెస్ అయ్యారనే ప్రచారం జరుగుతుంది. ఫలితంగా కాంగ్రెస్ ఓటింగ్ పూర్తి స్థాయిలో పలచబడుతుందని మంత్రి, ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా మంత్రి ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకే ఒక్కడు తరహాలో తన బుజస్కంధాలపై వేసుకుని పనిచేసినట్లు తెలుస్తోంది. ఆయన పడిన శ్రమను చూసిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు మంత్రికి అభినందనలు చెబుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరీ మంత్రి క్రషి పలిస్తుందా..? లేదా..? అనే విషయం ఈనెల 14న వచ్చే ఫలితాల్లో తెలనుంది.

చూద్దాం..? ఏం జరగబోతుందో..?