Telugu News

ఖమ్మం ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.

ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి , వెనక్కు పంపిన వైనం....

0

ఖమ్మం ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం
ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి , వెనక్కు పంపిన వైనం….
(ఖమ్మం –విజయంన్యూస్)
రోగం వచ్చి సర్జరీ కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన రోగికి గంటలు కాదు పది రోజులు గడిచిన సర్జరీ చేసేన వైద్యులు వస్తారనే ఆ నమ్మకం కోల్పోయింది.ఖమ్మం నగరం పంపింగ్ వెల్ రోడ్డు కు చెందిన తెనాలి కోటయ్య(58) కడుపులోని పేగు వ్యాధితో బాధ పడుతూ ప్రభుత్వ హాస్పిటల్ లో గత పది రోజుల క్రితం జాయిన్ అయ్యాడు. ప్రతిరోజు రేపు,మాపు అనుకుంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు.

శుక్రవారం ఆ పేషెంట్ కు సర్జరీ చేస్తామని ఆపరేషన్ దుస్తులు వేసి, అంత సిద్ధం చేసి…..థియేటర్ లోపలికి వెళ్లిన తర్వాత, నీకు సర్జరీ చేసే డాక్టర్ రాలేదని చెప్పడంతో నిస్సహాయత కు లోనయ్యాడు.ప్రతి రోజు ఇదే పరిస్థితి నెలకొంటుందని సాటి రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా మోర ఆలకించే నాధుడే లేకపోయేనని మనోవేదనకు గురవుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిత్యం ఇదే తంతు. సర్జరీ లు చేసే రోగులకు ఓపి చూసి డాక్టర్లు జారుకోవడం పరిపాటిగ మారింది. హాస్పిటల్ సూపరిండెంట్ లేదా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని సర్జరీలు సక్రమంగా నిర్వర్తిస్తే బాగుంటుందని కోరుతున్నారు.

also read :-ప.గో…జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ లో కీచక ఉపాధ్యాయుడుకి దేహశుద్ధి.