Telugu News

పిఠాపురం ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జనసైనికులు

పవన్ కళ్యాణ్ విజయమే లక్ష్యంగా ప్రచారం

0

పిఠాపురం ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జనసైనికులు

== పవన్ కళ్యాణ్ విజయమే లక్ష్యంగా ప్రచారం

(పిఠాపురం -విజయం న్యూస్)

ఆంద్రప్రదేశ్ లో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.ముఖ్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో ఊపందుకున్నాయి. ప్రధానంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో లక్ష మంది పైగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే,ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులు జిల్లేళ్ళ మహేష్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవాలని నియోజకవర్గ పరిధిలో చేబ్రోలు,కత్తిపూడి,పిఠాపురం,నాగులపల్లి,మల్లారం తదితర గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు,మాజీ ఎమ్మెల్యే వర్మ, తెలంగాణా జనసేన పార్టీ ఇన్చార్జి శంకర్ గౌడ్ వారిని అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో జనసేన పార్టీ పై విశేష స్పందన కన్పిస్తుందని,మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలువబోతురని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు కంటే విజయ్ సాయి,గోదా చెన్నారావు, షేక్ యాకుబ్ పాషా,గరిడేపల్లి శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.