Telugu News

విద్యార్థిగా మారిన జిల్లా బాస్

పాఠశాలలో విద్యార్థులతో కుర్చోనే బోజనం

0

విద్యార్థిగా మారిన జిల్లా బాస్

== పాఠశాలలో విద్యార్థులతో కుర్చోనే బోజనం

== ఉపాధ్యాయుడిగా మరో అవతారం

== విద్యార్థులకు భవిష్యత్ పాఠాలు చెప్పిన పెద్దాయన

(రిపోర్టర్: దామాల సురేష్ బాబు )

కల్లూరు,జులై 27(విజయంన్యూస్)

ఆయన ఒక జిల్లా బాస్.. అధికారులను, ఉద్యోగులను అందర్ని నడిపించే బిగ్ బాస్.. ఆయన విద్యార్థిగా మారారు.. తోటి విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. చదువుల గురించి అడిగారు.. పాఠాలను విన్నారు.. పంతులమ్మ పాఠాలు చెబుతుంటే విద్యార్థుల పక్కనే కుర్చోని శ్రద్ధగా విన్నారు. అనంతరం మధ్యాహ్నం బెల్ కొట్టారు.. విద్యార్థులతో కలిసి వాళ్లు ఎక్కడ చేతులు కడుక్కుంటే అక్కడే కడుక్కున్నారు. విద్యార్థులు రోజువారిగా కుర్చునే ప్లేస్ లోనే కుర్చున్నాడు. వాళ్లతోనే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వంటగదిని పరిశీలించారు. కూరగాయాలు, పప్పు, బియ్యంను తనిఖీ చేశాడు. మరోసారి బెల్ మోగింది.. విద్యార్థులతో కలిసి పాఠశాల తరగతి గదిలోకి వెళ్లారు. ఇప్పుడు అవతారం మారింది.. విద్యార్థిగా కాకుండా గురువైయ్యారు. విద్యార్థులకు భవిష్యత్ పాఠాలను భోదించారు. చదువుకోవడం వల్ల ఏమవుతారో..? మంచి ఫలితాలు సాధించడం వల్ల భవిష్యత్ ఎలా ఉంటుందో విద్యార్థులకు పాఠం ద్వారా వివరించారు. ఇంత చేసింది ఎవరనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదవండి..

allso read- కష్టంతో కాదు ఇష్టంతో చదవితే విజయం మీదే: ఎన్నికల అధికారి

ఖమ్మం జిల్లా కల్లూరులోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాంగణమంతా కలియ తిరుగుతూ విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ గదులను తనిఖీ చేశారు. వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల సరఫరా, కూరగాయలు, కిరాణా సరకుల సరఫరా విషయమై అడిగి తెలుసుకున్నారు. స్టోర్ గదిలో పప్పు, కూరగాయలు, ఇతర వస్తువులను కలెక్టర్ పరిశీలించారు. ఆవరణలో కూరగాయల పెంపకం గురించి అడిగి, స్థలం ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మెనూ విషయమై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో మమేకమై వారితో సంభాషిస్తూ, మధ్యాహ్న భోజనం చేశారు. వసతులు, ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పాటశాల విద్యార్థినులకు, కళాశాల విద్యార్థినులకు వేరు వేరు సమయాల్లో భోజనం అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం రెసిడెన్షియల్ కళాశాలకు వెళ్లి లెక్చరర్ గా విద్యార్థినులకు క్లాస్ తీసుకున్నారు. ఇంటర్ సిఇసి విద్యార్థినులకు డిమాండ్ స్థితిస్థాపకత గురించి వివరించారు. ఒక్కో విద్యార్థిని తన లక్ష్యం ఏమిటి అని అడిగి, అ లక్ష్య సాధనకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలో ఉద్భోదించారు. ప్రతి విద్యార్థినికి కెరీర్ మార్గదర్శనం కల్పించాలన్నారు. ఈ దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంలో కల్లూరు ఆర్డివో సూర్యనారాయణ, తహసిల్దార్ బాబ్ది ప్రసాద్, అధికారులు, పాటశాల, కళాశాల ఉపాధ్యాయులు తదితరులు వున్నారు.

allso read- అరెంజ్ అలార్ట్ హెచ్చరిక