Telugu News

ప్రేమకోసం రాలిన కుసుమం…ప్రేమ గెలిచింది.. ఆమె ఓడింది

ప్రేమ కోసం బాలిక బలవన్మరణం

0

ప్రేమకోసం రాలిన కుసుమం
– ప్రేమ గెలిచింది.. ఆమె ఓడింది
– ప్రేమ కోసం బాలిక బలవన్మరణం
– మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బాలిక

కారేపల్లి: మండలంలో డిసెంబర్.
1. ప్రేమ రెండే అక్షరాలు.. కానీ దాని ఫలితం రెండు జీవితాలు. ఒకరికి కంటే ఒకరుగా భావించింది. తనే జీవితం అనుకుంది. నా ప్రేమ గెలుస్తుందని గట్టిగా నమ్మింది. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని జీవితం గడపాలనుకుంది. ఆమె అనుకున్నట్లు జరగాలంటే తను ప్రేమించిన అబ్బాయి అనుకోవాలని గ్రహించలేక పోయింది. తను మనసారా ప్రేమించిన ప్రేమికుడు మోసగాడాని, తనపై కేవలం వ్యామోహం తోనే ప్రేమించాడని పసిగట్టలేక పోయింది. ఇంకే తన ప్రియుడి వంకరబుద్ధి బయట పడింది. తను ప్రేమించిన ప్రేమికుడు మోసగాడని తెలిసి ఎంతో బాధ పడింది. ఎంతో బతిమాలింది. కానీ ఆ యువకుడు ముఖం చాటేసి పెళ్లి చేసుకొనని తెలిపాడు. ధీంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్య కు పాల్పడి ప్రాణాలతో పోరాడి తనువు చాలించింది. ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలం ఎర్ర బోడు గ్రామంలో జరిగిన హృదయ విధారక సంఘటన..

ALLSO READ :- మావోయిస్టు ఇలాకాలో డీజీపీ పర్యటన.. భారీగా మోహరించిన బలగాలు
స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని ఎర్ర బోడు గ్రామానికి చెందిన ఓ బాలిక.. ఓ ప్రేవేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని. మాణిక్యారం గ్రామ శివారులో రూప్ తండాకు చెందిన నునావత్ తారా చంద్ మృతురాలి ని రెండేళ్లుగా ప్రేమ పేరుతో శారీరకంగా, మానసికంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు. తీరా పెళ్లి చేసుకోవాలని అడగ్గా ముఖం చాటేసాడు. పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్పాడు. ధీంతో ఎంతో ప్రేమించి మోసపోయిన ఆమె చేసేదేది లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తార చంద్ వేరే మహిళతో ప్రేమ రాయబారం నడిపిస్తూ ఆమెను నిరాకరించాడు. ఇన్ని రోజులూ తానే తన భాగస్వామి అని నిర్ధారించుకొని అతనికి శారీరకంగా, మానసికంగా దగ్గరయింది. ఎంతగానో ప్రేమించించిన తారా చంద్ మోసం చేయడంతో ప్రేమలో ఓడిపోయి, మోసపోయానని కుంగి పోయిన ఆమె తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

** తారా చంద్ ను కఠినంగా శిక్షించాలి: గ్రామస్తులు
మహిళలు, బాలికల పై అత్యాచారానికి, అఘాయిత్యాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు పరిధులు పెంచినప్పటికి ఇటువంటి దుర్లభ, హృదయ విధారక దుర్ఘటనలు మాత్రం ఆగడం లేదు. చట్టాలు ఎన్ని వచ్చినా ఇటువంటి ఆకతాయిలు చర్యలు మాత్రం అదుపు లేకుండా పోయింది. ఆత్మహత్య కు పాల్పడిన బాలిక కు అన్యాయం చేసిన తారా చంద్ ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎంతో నిజాయితీగా ప్రేమించిన ఆమె గ్రామంలో ఆడుతూ పాడుతూ తిరిగే పరిస్థితులు గుర్తుకు తెచ్చుకొని గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. సంబంధించిన అధికారులు స్పందించి మహిళల జీవితాలు, ప్రాణాలతో చేలాగాటమాడే ఆకతాయిలు అకృత్యాలు, ఆగడాలు నివారించేందుకు అమ్మాయిని మోసం చేసిన తార చంద్ ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, మహిళా సంఘాలు కోరుతున్నారు. మృతురాలి తండ్రి
చరప వీరస్వామి ఫిర్యాదు మేరకు కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALLSO READ :- క్యాంపస్‌లు మీ సొత్తు కాదు.. బరాబర్ పోతం..