Telugu News

గాంధీభవన్ కు పయనమైన  రామూర్తినాయక్ దంపతులు

నియోజకవర్గవ్యాప్తంగా తరలివెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులు

0

గాంధీభవన్ కు పయనమైన  రామూర్తినాయక్ దంపతులు

◆◆ 200 కార్లతో భారీ ర్యాలీ

◆◆ నియోజకవర్గవ్యాప్తంగా తరలివెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులు

◆◆ జెండా ఊపి ప్రారంభించిన రాయల

కూసుమంచి, జూన్ 27(విజయం న్యూస్)
ఖమ్మం రూరల్ మండలం టిఆర్ఎస్ పార్టీ కి సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్, మాజీ జెడ్పిటిసి భారతి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు హైదరాబాద్ లోని గాంధిభవన్ కు భారీగా తరలి వెళ్ళారు.  సోమవారం గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు, రామూర్తి నాయక్ వర్గీయులు, అభిమానులు భారీగా జనసమీకరణై హైదరాబాద్ కు వెళ్తున్నారు.

Also read:- కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటీ

ఈ మేరకు ఆయన పెద్ద ఎత్తున సుమారు రెండు వందల కార్లతో భారీ ర్యాలీ తో హైదరాబాద్ వెళ్ళారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా నుంచి ఈ కార్ల ర్యాలీని ఏర్పాటు చేయగా కాంగ్రెస్ జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు,  మాజీ కార్పొరేటర్ రామూర్తినాయక్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సంధర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ రామూర్తి నాయక్ దంపతులు పార్టీలోకి రావడం చాలా సంతోషకరమని అన్నారు. అందరం కలిసి పనిచేసి రఆబోయే రోజుల్లో జరిగే అసెంబ్లి ఎన్నికల్లో పాలేరుతో పాటు ఖమ్మఞ జిల్లాలోని అన్ని సీట్లనూ గెలిపించుకోవాలని అన్నారు. రామూర్తినాయక్ మాట్లాడుతూ  పార్టీ మారడం మంచిదని ఆలోచించి కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండలం లో రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా అందరినీ కలుపుకొని పని చేస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు మద్ది వీరారెడ్డి, యరబోలు శ్రీనివాస్ తదితరులు హాజరైయ్యారు