తమ్మినేని కృష్ణయ్య హత్యలో సూత్రదారులేవరు..? పాత్రదారులేవ్వరు..?
అసలైన నిందితులను తప్పించారనే ప్రచారం
సూత్రదారులేవరు..? పాత్రదారులేవ్వరు..?
== కక్ష్యలేవరివి..? బలైందేవరు..?
== తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితుల రిమాండ్ పై పలు అనుమానులు
== అసలైన నిందితులను తప్పించారనే ప్రచారం
== బహిరంగంగానే ప్రకటించిన ప్రజాపంథ పార్టీ
== పోలీసులు గులాబీ వనానికి కాపలదారులంటూ విమర్శ
== మీడియాల్లో కూడా పలు కథనాలు
== అసలు కారకులేవరు..?
ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 21(విజయంన్యూస్)
రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారిన తమ్మినేని కృష్ణయ్య హత్య విషయంలో అనేక అనుమానాలు.. అనేక సందేహాలు.. హత్యకు కారణం ఆ కుటుంబమే అంటూ గ్రామస్థులు ఆరోపిస్తుంటే.. కాదు..కాదు.. హత్యలకు వీరే కారణం అంటూ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసిన పరిస్థితి ఉంది.. అంతా పర్వాలేదనుకున్నప్పటికి అసలు విషయంపై సర్వత్ర చర్చ జరుగుతోంది..
allso read- తమ్మినేని క్రిష్ణయ్యను హత్యచేసిన నిందితులు అరెస్టు..రిమాండ్..?
హత్యకు కారకులేవ్వరు..? హత్య చేసిందేవరు..? జైలుకు పోయేదేవ్వరు..? అంటూ కొంత మంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి.. ఇప్పటికే వేలాధి మంది నేటిజన్లు ఆ ప్రశ్నలను సందిస్తున్నారు.. కానీ సమాధానం పోలీసులు మాత్రం తమ్మినేని కృష్ణయ్య హత్య చేసింది ఆ నలుగురే అంటున్నారు పోలీసులు.. ఆ నలుగురికి మరో నలుగురు సహాకరించారని చెబుతున్నారు.. కానీ ఎఫ్ఐఆర్ లో మొదట నమోదైన పేర్లు ఏమైనయో ఎవరికి అంతుబట్టకుండా ఉన్నది.. పోలీసులు కూడా ఈ విషయంపై ఎక్కడ స్పష్టతనివ్వలేదు.. పైగా నిందితులను రాత్రి సమయంలో కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ చూపించారు. కానీ ప్రజల మదిలో నిలిచి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి…?ఎఫ్ఐఆర్ లో ఏ1గా నమోదు చేసిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేరు లేకపోవడంపై పలు సందేహాలు నెలకొన్నాయి.. అసలు ఈ హత్య కేసు విషయంలో సూత్రదారులేవ్వరు..పాత్రదారులేవ్వరు..? కక్ష్యలేవరివి.. బలైందేవ్వరు..? ఎవరి కోసం హత్య జరిగింది..? ఎవరిని ఉద్దరించేందుకు హత్యచేశారు..? ఇవ్వన్ని తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే..?
ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, తెల్దారుపల్లి గ్రామంలో స్వాతంత్ర్యదినోత్సవం ఆగస్టు 15న ఉదయం 11గంటలకు హత్య జరిగింది. అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, సోసైటీ డైరెక్టర్ తమ్మినేని క్రిష్ణయ్యను దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన పరిస్థితి. జెండా పండుగ రోజున పక్కా ప్రణాళికతో 8మంది దుండగులు వేటకత్తులతో దాడికి పాల్పడి హత్య చేశారు. ఈ హత్య రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. రాష్ట్రంలోనే తిరుగులేని శక్తిగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన తమ్మినేని కృష్ణయ్యను సీపీఎం పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు పట్టపగలు ప్రజలు తిరుగుతున్నసమయంలో అతికీరాతకంగా హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా ఖమ్మం జిల్లా ఉలిక్కిపడింది.. రాజకీయ నాయకులు దిగ్ర్భాంతికి గురైయ్యారు.. అయితే ఈ హత్య విషయంలో స్థానికులు ఆగ్రహించారు. వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. హత్యకు కారణం తమ్మినేని కోటేశ్వరరావు అంటూ ఆయన ఇంటిని, ప్యాక్టరీని, గ్రానైట్ క్వారీని ద్వంసం చేశారు. దాడి చేసి హత్య చేసిన కొంత మంది వ్యక్తుల ఇండ్లపై దాడులు చేసి ద్వంసం చేశారు. జేసీబీని తగలబెట్టారు. ఆయన వల్లనే ఈ హత్య జరిగిందని ఊరి గ్రామస్థులందరు ఆరోపించారు. కుటుంబ సభ్యులు కూడా బహిరంగంగానే వాళ్ల పేర్లు బయటపెట్టారు. ఈ మేరకు తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో తమ్మినేని కోటేశ్వరరావుతో పాటు జక్కంపూడి క్రిష్ణ, బోడపట్ల శ్రీనివాస్, గజ్జిక్రిష్ణ, ఎస్ కె.రంజాన్, నూకల లింగయ్య, నాగేశ్వరరావు తదితర పలువురి పేర్లతో కూడిన లేఖతో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఖమ్మం రూరల్ పోలీసులు కూడా ఏ1గా తమ్మినేని కోటేశ్వరరావు, ఏ2గా ఎస్.కె రంజాన్, ఏ3గా జక్కంపూడి క్రిష్ణ, ఏ4గా గజ్జి క్రిష్ణ, ఏ5గా నూకల లింగయ్య, ఏ6గా బండ నాగేశ్వరరావు, ఏ7గా బోడపట్ల శ్రీను, ఏ8గా ఎల్లంపల్లి నాగయ్య పేర్ల పై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అయితే.. ఆ తరువాత జరిగిన రిమాండ్ లో మాత్రం సంచలనంగా కొన్ని పేర్లు తెరమీదకు వచ్చాయి.. కొన్ని పేర్లు అసలు లేకుండా పోయాయి..
allso read- కల్యాణం..కమనీయం..పువ్వాడ వారి పరిణయం
ఏ1గా బోడపట్ల శ్రీనివాస్, ఏ2గా గజ్జిక్రిష్ణ, ఏ3గా నూకల మల్లయ్య, ఏ4గా బండారు నాగేశ్వరరావు, ఏ5గా కన్నెకంటి నవీన్, ఏ6గా జక్కంపూడి క్రిష్ణ, ఏ7గా మల్లారపు లక్ష్మయ్య, ఏ8గా ఎస్.కె రంజాన్ పేర్లను నమోదు చేశారు. ఏ1 నుంచి ఏ4 వరకు ఉన్న నిందితులు హత్య చేశారని, ఏ5 నుంచి ఏ8 వరకు ఉన్న వారు హత్య చేసేవారికి సహాకరించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా నమోదు చేశారు. అయితే ఇందులో అశ్ఛర్యకరమైన విషయమేమిటంటే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్షి చెప్పిన ఆ రెండు పేర్లను మాత్రం రిమాండ్ రిపోర్టు నుంచి తొలగించారు. ఎందుకంటే ఆ హత్య విషయంలో వారి పాత్ర లేదని పోలీసులు స్పష్టంగా తెల్చేశారు. కానీ అందులో రిమాండ్ రిపోర్టులో లేని వారు కొంత మందిపై అనుమానాలతో విచారణ చేస్తున్నామని తెలిపారు. దీంతో పోలీసులు వ్యవహార శైలిపై ప్రజలు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక మీడియాలో ఈ అంశంపై వరస కథనాలు వస్తున్న పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో రిమాండ్ రిపోర్టు పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
== సూత్రదారులేవ్వరు..? పాత్రదారులేవ్వరు..?
తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు పెద్ద సంచలనంగా మారింది. పోలీసులకే ఇది సవాల్ గా మారింది. అయినప్పటికి పోలీసులు పలువరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ హత్య జరగడానికి గల కారణాలను పరిశీలిస్తే అసలు సూత్రదారుల విషయంలో కొంత జాప్యత జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. 1969నుంచి తెల్దారుపల్లి ‘రక్త చరిత్ర’ సినిమాను తలపిస్తోంది. పార్టీల మధ్య వైరం పెరిగింది. జెండా పాతితే జీవం తీసేస్తున్న పరిస్థితి ఆ గ్రామంలో చోటు చేసుకుంది. 1969, 1970లో ప్రారంభమైన హత్యప్రయత్నాలు ఇప్పటికి 5 హత్యలుగా, మూడు హత్యయత్నాలుగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తండ్రి సుబ్బయ్యపై 1969,1970లో రెండు సార్లు హత్యయత్నం చేయగా, సుబ్బయ్య కోమాలకి వెళ్లిన పరిస్థితి నెలకొంది. ఆ తరువాత 1971లో కాంగ్రెస్ నేత గొల్ల చంద్రయ్య హత్య, 1972లో మరోసారి కాంగ్రెస్ నేత హత్య గజ్జి చంద్రయ్య హత్య జరిగింది. దీంతో ఆగ్రఆవేశంతో ఉన్న కాంగ్రెస్ నాయకులు 1974లో సీపీఎం నేత తమ్మినేని సుబ్బయ్య ముఖ్యఅనుచరుడు ఎర్రబిక్ష్మం హత్య, 1974లో కాంగ్రెస్ నేత వెగనాటి రంగయ్యపై హత్యాయత్నం జరిగింది. ఆ తరువాత 2002లో టీడీపీ జెండా ఎగరేశారని వెగనాటి వెంకయ్య అనే పట్వారిని సీపీఎం పార్టీ నాయకులు హత్యచేశారు. ఆ తరువాత 2022,ఆగస్టు 15న టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను హత్య చేశారు. ఇక్కడ జరిగిన హత్యలు, హత్యాయత్నాలు అన్ని రాజకీయ కోణంలో జరిగినవే..
allso read- తెల్దారుపల్లిలో రక్తచరిత్ర..
ఏ ఒక్కటి వ్యక్తిగతం కోసమే, భూ తగదాలు, డబ్బుల పంచాయతీల విషయంలో జరిగిన హత్యలు కావు. రాజకీయ పెద్దల కోసం చేసిన హత్యలు మాత్రమే అంటూ గ్రామస్థులు చెబుతున్నారు. తమ్మినేని కృష్ణయ్య పై జరిగిన హత్య కూడా అదే. పెద్దల కోసం కొందరు చిన్నవ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ ఆగ్రనేతను హత్య చేశారు. అందులో సూత్రదారులేవ్వరో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చెబుతూనే ఉన్నారు.. సూత్రదారులు చెబితే, పాత్రదారులు పాత్రపోషించి హత్యచేశారని కూడా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు విచారణలో మాత్రం సూత్రదారులు ఆ నలుగురు.. పాత్రదారులు ఈ నలుగురు అంటూ తెల్చేశారు.. ఒక విషయం ఎమిటంటే.. పార్టీ కోసం ప్రాణాలిచ్చే వారు ఈ ఎనిమిది మంది.. కానీ ప్రాణాలు తీసే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మరో ప్రశ్న.. రాజకీయంగా బడా నాయకులు అయ్యే చాన్స్ వాళ్లకు ఉందా..? అస్తితగాదాలు ఉన్నాయా..? ఆ ఎనిమిది మందిలో ఎవరికైనా రాజకీయ పదవులు వస్తుంటే తమ్మినేని కృష్ణయ్య అడ్డంపడ్డారా..? అంటే అది లేదు. కేవలం సూత్రదారుల కోసం పాత్రపోషించి బలైయ్యారని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా విశ్లేషిస్తున్నారు.
== పోలీసుల తీరుపై ప్రశ్నించిన ప్రజాపంథ పార్టీ
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలో జరిగిన హత్య కచ్చితంగా రాజకీయ కోణంలో జరిగిందని, రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని ఆగ్రనాయకులు ఈ హత్య చేయించారని, కానీ పోలీసులు కేసు నమోదు చేసే విషయంలో తప్పుడు కేసులు పెడుతున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ పోలీసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సేవకులుగా మారిపోయారి, గులాబీ వనానికి కాపలదారులైయ్యారని పోటు రంగారావు ఆరోపించారు. మాజీ మంత్రి ముఖ్య అనుచరుడిని హత్య చేసిన కేసు విషయంలో పోలీసులు వక్రబుద్ది చూపించడం సరైంది కాదని, అసలు నేరస్థులు, సూత్రదారులు వేరే ఉన్నారని వారిపై కేసు నమోదు చేయకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. పోలీసులు సమాజానికి సేవకులుగా ప్రజలకు రక్షకభటులుగా ఉండాలని, హత్యలు చేసే నాయకులకు రక్షకభటులుగా ఉండకూడదని ఆరోపించారు. అయితే ఖమ్మం జిల్లాలో ఇలాంటి రాజకీయ హత్యలకు పుల్ స్టాఫ్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పకడ్భందిగా ఇంటిలిజెన్సీ వ్యవస్థను మెరుగుపర్చుకుని ఏ గ్రామంలో ఎలాంటి కక్ష్యపూరిత వాతావరణం ఉందో తెలుసుకుని ముందస్తుగానే చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తద్వారా ఎలాంటి రాజకీయ హత్యలుజరిగే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. చూద్దాం పోలీసులు రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో..?