Telugu News

ఎక్సైజ్ ఉద్యోగుల దాష్టికం

ఎందుకోసమంటే..? ఇది కామనేగా.. అనుకుంటే పోరపాటే..?

0

ఎక్సైజ్ ఉద్యోగుల దాష్టికం

== ఇంట్లో దూరి తనిఖీలు చేసిన ఉద్యోగులు

== బీరువాలను తీసి.. బట్టలు తీసేసి తనిఖీలు

== ఎందుకోసమంటే..? ఇది కామనేగా.. అనుకుంటే పోరపాటే..?

కూసుమంచి, జులై 2(విజయంన్యూస్)

ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయడం కామన్.. వారి విధినిర్వాహణ అది.. సారా విక్రయిస్తున్నారనో..? కల్తి మద్యం స్టాక్ ఉందనో, గంజాయి పండిస్తున్నారనో..? అక్రమ రవాణా చేస్తున్నారనో.. సమాచారం రావడంతో తనిఖీలు చేయడం అనువాయితి. అది ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తారు.. కానీ ఈ మండలంలో మాత్రం వైన్స్ యజమానులు చెబితే ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.. ఇండ్లన్ని చోదాలు చేస్తున్నారు.. బీరువాలు తీస్తున్నారు.. బట్టలు పడేస్తున్నారు.. బస్తాలను తొలగిస్తున్నారు..అబ్బో అవసరమైతే అక్కడ కూడా చూస్తారేమో..? అన్నట్లుగా తనిఖీలు చేస్తున్నారు..  నమ్మలేరా..? అయితే పూర్తి వివరాలు చదవండి

ఇది చదవండి : మద్దులపల్లి మార్కెట్ లో అక్రమాలు నిజమెంతా..?

కూసుమంచి మండలంలోని ముత్యాలగూడెం గ్రామంలో ఓ మహిళ గత కొన్నేళ్లుగా బెల్ట్ షాపు నడిపిస్తుంది. దుకాణంలో మద్యం విక్రయాలు చేస్తుంది. అయితే ఇంట్లో అక్రమ మద్యం..కాదు..కాదు.. ఖమ్మం నుంచి కొనుక్కొని తీసుకొచ్చిన మద్యం స్టాక్ ఉందని నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మాట   నిజమనుకుంటున్నారా..? కాదండి బాబు.. వైన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక టీమ్(తనిఖీ బృందం) సభ్యులకు సమాచారం అందింది. ఇంకేముంది.. వారు ఆ ఇంటిని చుట్టుముట్టారు.. తనిఖీలు చేద్దామని అనుకున్నారు.. కానీ ఆ ఇంటి యజమానురాలు అవకాశం ఇవ్వలేదు..మీకేం హక్కు ఉంటుందని ప్రశ్నించింది. దీంతో వైన్స్ ప్రత్యేక టీమ్ సభ్యులకు చిర్రత్తింది.. నీ సంగతి ఇట్టనా..? అనుకున్న ఆ సభ్యులు నేరుగా నేలకొండపల్లి ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన ఎక్సైజ్ అధికారులు తమ ఉద్యోగులను ముత్యాలగూడెం పంపించి, ఆ ఇంట్లో చోదాలు చేయించారు.. ఎక్సైజ్ పోలీసులు రావడంతో ఆ మహిళ తప్పని పరిస్థితుల్లో నిశబ్ధంగా ఉండిపోయింది. ఇక ఇదే అదునుగా భావించిన మన ఎక్సైజ్ సిబ్బంది ఇంట్లో అనువనువు తనిఖీ చేశారు. బీరువా తాళ్లాలు తీసి బట్టళ్లో, బయట, మంచం కిందా అన్ని ప్రాంతాల్లో తనిఖీ చేశారు.. చివరికి అక్కడ ఏమి దొరకకపోవడంతో ఎక్సైజ్ అధికారులు వాటిని అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. అయితే తనిఖీల సమయంలో ఆ ఇంటి యజమాని కుటుంబంతో సహా అదిలాబాద్ జిల్లాలో ఉన్నారు.

ఇది చదవండి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక అజ్ఞానాని

తల్లి మాత్రమే ఇంటి వద్ద ఉన్నది. కనీసం ఇంటి యజమానికి సమాచారం లేకుండా తనిఖీలు చేయడం గమనర్హం. అయితే ఈ విషయంపై తన కుమారుడకి తల్లి సమాచారం అందించగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేలకొండపల్లి సీఐ కి పోన్ చేసి పోటోలను పంపించి ఇదేం పద్దతి అని అడిగితే బీరువాలు, ఇంటిని మొత్తం తనిఖీ చేసే హక్కు మాకు ఉందని, అయితే తనిఖీ చేసిన తరువాత ఎలా ఉన్నాయో అలా సర్థి పెట్టాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉంటుందని చెప్పాడు. మా పరిధిలోని కూసుమంచి మద్యం కాకుండా ఖమ్మం నుంచి  మద్యం తీసుకొచ్చారని, అందుకే తనిఖీలు చేశామని చెబుతుండటం గమనర్హం. ఈ విషయంపై విజయం ప్రతినిధి నేలకొండపల్లి ఎక్సైజ్ సీఐ ని వివరణ కోరగా ఇండ్లలో తనిఖీలు చేసే హక్కు ఎక్సైజ్ అధికారులకు, ఉద్యోగులకు ఉంటుందని, కానీ తనిఖీల ముందు ఇళ్లు ఎలా ఉందో..? తనిఖీల అనంతరం అలాగే ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత మాపై ఉంటుందన్నారు. బెల్డ్ షాపుల్లో మద్యం విక్రయాలు పెరిగాయని, అందుకే తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నారు.

== బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారా..?

గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వాహణకు అనుమతి లేదు. వైన్స్ షాపులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే ఎవరు నమ్మిన నమ్మకపోయిన ప్రభుత్వం మద్యంను అధికంగా విక్రయాలు చేయాలని ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లను విధిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎక్సైజ్ అధికారులు చేసేది లేక బెల్డ్ షాపులను ప్రోత్సహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే బెల్ట్ షాపులకు కూడా మద్యం సరఫరా చేసే విషయంలో సరిహద్దులు ఉంటాయనే సంగతి  ఈ రోజే బోదపడింది. ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం చెప్పినట్లుగా కాకుండా వైన్స్ యజమాన్యం చెప్పినట్లుగా నడుస్తూ తనిఖీలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకనేమో..? బెల్ట్ షాపులల్లో మద్యం దరలు మండిపోతున్నాయి..